సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్‌కు అరుదైన గౌరవం లభించింది. భారత్‌లో అత్యంత ప్రభావశీల మహిళగా మిథాలీని బీబీసీ గుర్తించింది. ఈ ఏడాది భారత్‌లోని ప్రభావవంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు చోటు దక్కింది. ప్రపంచ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రికార్డు నమోదు చేసిన విషయం విదితమే.
మిథాలీతో పాటు ఢిల్లీకి చెందిన రచయిత, యోగ టీచర్, సామాజిక కార్యకర్త ఇరా త్రివేది, జర్నలిస్ట్ తులికా కిరణ్, బెంగుళూర్‌కు చెందిన ఎంబైడ్ వ్యవస్ధాపక సీఈవో అదితి అవస్థి, నటుడు నవాజుద్దీన సిద్దిఖీ తల్లి మెహరున్నిసా సిద్ధిఖిలు ఈ జాబితాలో ఉన్నారు. ఆధునిక జీవితంలోని అన్ని రంగాల్లో వీరు తమదైన ముద్రతో దూసుకుపోతున్నారు.