ఎంపీ కోల్ట్స్ బౌలర్ మోహిత్ సోని (7/15) ధాటికి ఆంధ్రాబ్యాంక్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు.
హైదరాబాద్: ఎంపీ కోల్ట్స్ బౌలర్ మోహిత్ సోని (7/15) ధాటికి ఆంధ్రాబ్యాంక్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో సోమవారం మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రాబ్యాంక్ 139 పరుగులకే కుప్పకూలింది. కిరణ్ కుమార్ (44 నాటౌట్) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఎంపీ కోల్ట్స్ ఆట నిలిచే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లకు 83 పరుగులు చేసింది. మికిల్ జైస్వాల్ (41 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఎన్స్‌కాన్స్: 216 (కొల్లా సుమంత్ 101, తాహా షేక్ 37; సాకేత్ సాయిరామ్ 4/71, కార్తీకేయ 3/44). జైహనుమాన్: 71/3 (వినీత్ 34).
స్పోర్టింగ్ ఎలెవన్: 412/7 (మాన్‌సింగ్ రమేశ్ 154, యతిన్ రెడ్డి 87, చైతన్యకృష్ణ 57;తనయ్ త్యాగరాజన్ 3/155), కేంబ్రిడ్జ్‌తో మ్యాచ్.
ఎస్‌బీహెచ్: 324/3 (కేఎస్కే చైతన్య 141 బ్యాటింగ్, అనూప్ పాయ్ 102 బ్యాటింగ్), ఎవర్‌గ్రీన్‌తో మ్యాచ్.
ఎస్‌సీ రైల్వే: 195 (ఎలాజెర్ 59; రాజమని ప్రసాద్ 3/38), ఈఎంసీసీ: 8/0.
జెమినీ ఫ్రెండ్స్: 184/6 (సయ్యద్ అలీ హైదర్ 57, రాధాకృష్ణ 31), గుజరాతీ సీసీతో మ్యాచ్.
గౌడ్స్ ఎలెవన్: 201/7 (రేవంత్ సాయి 72, సంకీర్త్ 33; కోటేశ్వర్ రావు 3/28), ఏఓసీతో మ్యాచ్.
ఆర్.దయానంద్: 256/7 (లోహిత్ 97, వంశీరెడ్డి 49 బ్యాటింగ్; శుభం శర్మ 5/77), చార్మినార్ సీసీతో మ్యాచ్.