
సోషల్ మీడియాలో ధోనీ కూతురి ఫొటో వైరల్
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే ఎంతో మోజు. ధోనీకి ఏ మోటార్ సైకిల్ అయినా నచ్చిందంటే అది వెంటనే అతని ఇంట్లో ఉండాల్సిందే. మామూలు బైకుల నుంచి ఖరీదైన స్పోర్ట్స్ బైకుల వరకు అతని దగ్గర చాలా ఉన్నాయి. మహీ తన దగ్గర ఉన్న బైకుల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. ఆశ్చర్యంగా ఈ సారి సోషల్ మీడియాలో ధోనీ కూతురు జీవా దర్శనమిచ్చింది. ఈ ఫొటోలో జీవా తన తండ్రి కాన్ఫెడరేట్ హెల్‌కాట్ బైకుపై కూర్చుని ఉంది.
ధోనీ భార్య సాక్షి ఈ ఫొటోను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో జీవా ఎంతో ముద్దుగా, ఉల్లాసంగా కనిపిస్తోంది. ఫొటోషూట్‌లో భాగంగా శిప్రా, అమిత్ చాబ్రా ఈ ఫొటోను తీశారు. ధోనీ అభిమానులకు ఈ ఫొటో తెగనచ్చేసిందట.