సాక్షి, హైదరాబాద్: ట్రిపుల్ ఒలింపియన్, భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ముకేశ్ కుమార్ నేతృత్వంలోని తెలంగాణ హాకీ సంఘం (టీహెచ్)కు గుర్తింపు ఇచ్చే విషయంలో వివాదం నెలకొంది. ముకేశ్ కార్యవర్గాన్ని కాకుండా భీమ్ సింగ్ ఆధ్వర్యంలోని సంఘానికి ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఓఏటీ) గుర్తింపు ఇవ్వడమే దీనికి కారణం. 2015 డిసెంబర్‌లోనే తమ సంఘాన్ని హాకీ ఇండియా (హెచ్‌ఐ) గుర్తించినా... ఓఏటీ మాత్రం తమ దరఖాస్తును పట్టించుకోలేదని ముకేశ్ కుమార్ ఆరోపించారు. ‘ఈ ఏడాది జనవరిలోనే ఓఏటీకి కావాల్సిన సంబంధిత పత్రాలు అందజేశాం.
వారి సూచన మేరకు అక్టోబర్ 15న మా ప్రతినిధి ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యారు. అరుుతే మరో వర్గాన్ని గుర్తించడం ఆశ్చర్యం కలిగించింది. దీనిపై హాకీ ఇండియాకు ఫిర్యాదు చేశాం’ అని ముకేశ్ కుమార్ చెప్పారు. హెచ్‌ఐ చైర్మన్ నరీందర్ బాత్రా తనకు పూర్తిగా మద్దతు పలికారని, హెచ్‌ఐ చెప్పినవారికి కాకుండా మరొక సంఘాన్ని ఓఏటీ గుర్తించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. పది నెలల వ్యవధిలోనే హాకీ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ముకేశ్ వెల్ల్లడించారు. మరోవైపు ముకేశ్ ఆరోపణలను ఓఏటీ అధ్యక్షుడు రంగారావు ఖండించారు. ‘ఆటగాడిగా మేం ముకేశ్‌ను గౌరవిస్తాం. అరుుతే మేం నిబంధనల ప్రకారమే వ్యవహరించాం. ఎన్నికలు, కార్యవర్గంలాంటి ప్రాథమిక అంశాలను పట్టించుకోకుండా సంఘం అని చెబితే ఎలా? ప్రస్తుతానికి భీంసింగ్ వర్గాన్నే మేం గుర్తిస్తున్నాం. బాత్రాకూ అదే చెప్పాను. మున్ముందు దీనిపై మరింతగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని రంగారావు స్పష్టం చేశారు.
మా హాకీకి గుర్తింపు ఇవ్వరా?
Published Thu, Nov 17 2016 10:24 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
Advertisement