పాండ్యాతో ఉన్న ఆ 'మిస్టిరియస్‌ గర్ల్‌‌' ఎవరు? | Mysterious girl posts picture with Hardik Pandya | Sakshi
Sakshi News home page

పాండ్యాతో ఉన్న ఆ 'మిస్టిరియస్‌ గర్ల్‌‌' ఎవరు?

Published Sat, Mar 26 2016 11:05 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

పాండ్యాతో ఉన్న ఆ 'మిస్టిరియస్‌ గర్ల్‌‌' ఎవరు? - Sakshi

పాండ్యాతో ఉన్న ఆ 'మిస్టిరియస్‌ గర్ల్‌‌' ఎవరు?

ఓ మిస్టిరియస్‌ గర్ల్‌తో భారత యువ క్రికెటర్ హార్థిక్‌ పాండ్యా దిగిన ఫొటో ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. అత్యంత ఉత్కంఠ మధ్య చివరిబంతి వరకు హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పై భారత్ గెలిచిన నేపథ్యంలో ఈ ఫొటో తెరపైకి వచ్చింది. చివరి ఓవర్‌లో తెలివైన బౌలింగ్‌తో పాండ్యాకు భారత్‌కు అద్భుతమైన విజయం అందించిన సంగతి తెలిసింఏద.

ఈ నేపథ్యంలోనే పాండ్యాతో ఓ అమ్మాయి దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ఆమె ఎవరు అని ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. కోల్‌కతాలో ఉంటున్న మోడల్‌ లిషా శర్మ అని తేలింది. జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్ జిల్లా ఆమె స్వస్థలం. హార్థిక్ పాండ్యాను తెగ ప్రశంసిస్తూ ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టింది. డేటింగ్ చేయడానికి అతడు పర్ఫెక్ట్‌ అని కితాబిచ్చింది. అయితే లిషాతో తాను కలిసి దిగిన ఫొటోపై స్పందించడానికి పాండ్యా నిరాకరించాడు. మరోవైపు ఈ ఫొటోను హార్థిక్ పాండ్యా తండ్రి కొట్టిపారేశాడు. పబ్లిసిటీ కోసమే ఆమె ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పెట్టిందని ఆయన పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement