సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లను గురువారం ప్రకటించారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు గ్రామ తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్ గ్రౌండ్‌లో ఈనెల 18 నుంచి 23 వరకు నిర్వహించిన శిక్షణా శిబిరంలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపిక చేశారు. ఈ జట్లలో తెలంగాణలోని 10 జిల్లాలకు చెందిన 24 మంది బాలబాలికలు చోటు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర నెట్‌బాల్ సంఘం (ఎన్‌ఏటీఎస్) కార్యదర్శి మొహమ్మద్ ఖాజా ఖాన్ స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోచ్ బి. మనోజ్ కుమార్, సంయుక్త కార్యదర్శి సయ్యద్ మొహమ్మద్ అహ్మద్, వరంగల్ నెట్‌బాల్ సంఘం అధ్యక్షులు సాంబరెడ్డి, కార్యదర్శి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ వేదికగా జాతీయ నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఈనెల 27 నుంచి 30 వరకు జరుగుతుంది.
జట్ల వివరాలు
బాలురు: బి. కుమార్, బి. భాను తేజ, ఎం. విజయ్‌కాంత్, కె. సుధాకర్, వి. కిరణ్, జె. నరేందర్, సీహెచ్.రాజీవ్, డి. సాయివర్ధన్, జె. మహేశ్, బి. సిద్ధార్థ్, కె.సోమ్‌నాథ్, బి. రాకేశ్, బి. మనోజ్ కుమార్ (కోచ్), బి. రఘురామ్ (మేనేజర్).
బాలికలు: ఎ. అశ్విని, టి. ఝాన్సీలక్ష్మి, కె. స్వాతి, టి. చందన, డి. పూజిత, ఎస్. జ్యోష్న, కె. సౌమ్య, ప్రసన్న, డి. వాహిని, ఎస్. ప్రసన్న, జె. జోసెఫిన్ వయొలెట్, లేఖన, సయ్యద్ అంజద్ అలీ (కోచ్), లిల్లీ ఫ్లోరెన్స్ (మేనేజర్).
Comments
Please login to add a commentAdd a comment