జింఖానా, న్యూస్‌లైన్: ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ జట్టు ఆటగాళ్లు రోహిత్ భరద్వాజ్ (182), భరత్ రాజ్ (5/71) చెలరేగడంతో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో జై భగవతీ ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో తొలి రోజు బ్యాటింగ్ చేసిన జై భగవతీ ఎలెవన్ 329 పరుగులు చేసి ఆలౌటైంది. రాహుల్ పతంగే (117) సెంచరీతో కదం తొక్కగా, వికాస్ బాబు 45, భరత్ 33 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆక్స్‌ఫర్డ్ బ్లూస్ 7 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. దీపాంకర్ 37, వికాస్ బిల్లా 30 పరుగులు చేశారు.
జై భగవతీ బౌలర్లు ఎస్‌ఎస్ భరత్ 4, వికాస్ బాబు 3 వికెట్లు చేజిక్కించుకున్నారు. మరో మ్యాచ్‌లో గౌడ్స్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ సాయి అక్షయ్ రాజ్ (129) సెంచరీతో రాణించినప్పటికీ ఆ జట్టు 102 పరుగుల తేడాతో జై భగవతీ ఎలెవన్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ 381 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గౌడ్స్ ఎలెవన్ 279 పరుగుల వద్ద ఆలౌటైంది. సాయినాథ్ (53) అర్ధ సెంచ రీతో రాణించాడు. జైభగవతీ బౌలర్లు సన్నీ పాస్త 4, త్యాగరాజన్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
స్పోర్టింగ్ ఎలెవన్: 253 ; ఖల్సా: 154 ( అలీఖాన్ 47; వేణు మాధవ్ 5/31).
చార్మినార్ సీసీ: 314 ; హెచ్‌ఎస్‌బీసీ: 281 (అజింక్య 40, యుదిష్ 93, రోహిత్ 61, హుస్సామ్ అఫంది 34; సయ్యద్ 4/55, సమీ అన్సారి 3/50).
జెమిని ఫ్రెండ్స్: 284 : తెలంగాణ: 232 (రియాజ్ 50, అనురాగ్ విట్టల్ 69, రాకేష్ 32; క్రిస్టీ విక్టర్ 3/58).
ఎంసీసీ: 303 ; రాజు సీసీ: 219 (ఉపేందర్ 65, దినేష్ 70; రాజా వెంకటేశ్ 5/39, ప్రభు 3/30).
చెలరేగిన భరద్వాజ్, భరత్ రాజ్
Published Sat, Nov 9 2013 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement