రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని విభజించాలని... రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రంగారెడ్డి, కృష్ణా జిల్లాల ఒలింపిక్ సంఘ కార్యదర్శులు మల్లారెడ్డి, కేపీరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రెండు రాష్ట్రాల క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు శాప్, శాట్స్ ఎండీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు.