రద్వాన్‌స్కా శుభారంభం | Radwanska pass through first round in US open | Sakshi
Sakshi News home page

రద్వాన్‌స్కా శుభారంభం

Published Tue, Aug 27 2013 3:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:08 PM

రద్వాన్‌స్కా శుభారంభం

రద్వాన్‌స్కా శుభారంభం

 న్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో స్టార్ క్రీడాకారిణులు అగ్నీస్కా రద్వాన్‌స్కా, నా లీ శుభారంభం చేశారు. సోమవారం ఆర్ధర్ ఆషే స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీల మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వీరిద్దరు తమ ప్రత్యర్థులను సులువుగా ఓడించారు. యూఎస్ ఓపెన్‌లో ఇప్పటిదాకా నాలుగో రౌండ్ దాటని మూడో సీడ్ రద్వాన్‌స్కా 6-1, 6-2 తేడాతో స్పెయిన్‌కు చెందిన అన్ సీడెడ్ సిల్వియా సోలెర్ ఎస్పినోసాపై నెగ్గింది. ఆరంభం నుంచే పదునైన షాట్లతో విరుచుకుపడిన ఈ పోలండ్ బ్యూటీ ధాటికి ఏ దశలోనూ సిల్వియా పోటీనివ్వలేకపోయింది. దీంతో కేవలం 24 నిమిషాల్లోనే 6-1తో తొలి సెట్‌ను దక్కించుకుంది. అనంతరం రెండో సెట్‌లోనూ ప్రత్యర్థి నుంచి పెద్దగా సవాల్ ఎదురు కాకపోవడంతో 63 నిమిషాల్లోనే మ్యాచ్‌ను పూర్తి చేసి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.
 
  మరో మ్యాచ్‌లో చైనాకు చెందిన ఐదో సీడ్ నా లీ 6-2, 6-2 తో ఓల్గా గొవోర్‌త్సోవా (బెలారస్)పై సునాయాసంగా గెలిచింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో నా లీ నాలుగు బ్రేక్ పాయింట్లను దక్కించుకుంది. లారా రాబ్సన్ (బ్రిటన్) 7-5, 6-0తో లౌర్డెస్ డొమిన్గెజ్ లినో (స్పెయిన్)ను, కార్లా సావెజ్ నవర్రో (స్పెయిన్) 6-0, 6-0తో లారెన్ డేవిస్ (అమెరికా), కాయా కనేపి 4-6, 7-6(4), 6-1తో వానియా కింగ్ (అమెరికా)ను ఓడించారు పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో డానియల్ ఇవాన్స్ (బ్రిటన్) 6-4, 6-4, 6-2 తేడాతో కీ నిషికోరి (జపాన్)పై గెలిచాడు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement