జైపూర్: రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రశంసల్లో ముంచెత్తాడు. జైపూర్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో పరాగ్ (43; 29 బంతుల్లో, 5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకున్నాడు. కెప్టెన్ స్మిత్‌తో కలిసి 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. బౌలింగ్‌లోనూ రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి ఫరవాలేదనిపించాడు. దీంతో పరాగ్‌ను జట్టు కెప్టెన్ స్మిత్ కొనియాడాడు.
‘17ఏళ్ల పరాగ్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా కనిపిస్తున్నాడు. లక్ష్య ఛేదనలో ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా బ్యాటింగ్ చేయడం మామూలు విషయం కాదు. గత మ్యాచ్‌ల్లోనూ పరాగ్ బాగా ఆడాడు. నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. పరాగ్‌కు బౌలింగ్‌లోనూ మంచి నైపుణ్యం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ రోజు కూడా పరాగ్ వేసిన బంతులు భిన్నంగా ఉన్నాయి. అతను ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటాడు’ అని స్మిత్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
(ఇక్కడ చదవండి: సూపర్ స్మిత్)
Comments
Please login to add a commentAdd a comment