
సెమీస్‌లో సానియా జోడి
టోక్యో: టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి పాన్ పసిఫిక్ ఓపెన్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోంది. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో మార్టినా హింగిస్-బెలిండా బెన్సిక్ జోడిపై 6-4, 6-2 తేడాతో వీరు సునాయాసంగా నెగ్గారు. కేవలం 62 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సానియా ద్వయం ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడు సార్లు బ్రేక్ చేయగా నాలుగు సార్లు తమ సర్వీస్‌ను కోల్పోయింది. సెమీస్‌లో జెలెనా జంకోవిచ్-అరంటా పారా సంటోంజాతో తలపడనున్నారు. ఈ టోర్నీ ముగిశాక సానియా నేరుగా ఆసియా గేమ్స్ కోసం ఇంచియాన్ వెళ్లనుంది.