సెమీస్‌లో సానియా జోడీ | Sania and semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సానియా జోడీ

Published Sat, Oct 25 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

సెమీస్‌లో సానియా జోడీ

సెమీస్‌లో సానియా జోడీ

డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ

సింగపూర్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో సానియా-కారా బ్లాక్ 6-3, 2-6, 12-10తో రాకెల్ కాప్స్ జోన్స్-అబిగెయిల్ స్పియర్స్ (అమెరికా)లపై గెలిచారు. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌ను మూడుసార్లు చొప్పున కోల్పోయాయి. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో ఆధిక్యం దోబూచులాడినా తుదకు సానియా జంటనే విజయం వరించింది.

శనివారం జరిగే సెమీఫైనల్లో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటతో సానియా జోడీ తలపడుతుంది. పెశెక్, స్రెబోత్నిక్‌తో జరిగిన క్వార్టర్స్‌లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ ద్వయం 1-2తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ఈ టోర్నీలో కుద్రయెత్సేవా (రష్యా)-రొడియోనోవా (ఆస్ట్రేలియా); సు వీ సెయి (చైనీస్ తైపీ)-పెంగ్ షుయె (చైనా) జంటలు కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement