సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ అండర్–12 టోర్నమెంట్‌లో శరణ్య, రిషిత్ సెమీస్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని డీఆర్‌సీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ శరణ్య 8–4తో తానియాపై గెలుపొందింది.
ఇతర మ్యాచ్‌ల్లో రిషిక 8–0తో గీతాంజలిపై, వి. వర్ష 8–6తో యశస్విపై, రహీన్ 8–3తో సం స్కృతిపై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో లలిత్ మోహన్ 8–7 (4)తో కోట శ్రీనాథ్‌పై, అర్మన్ సింగ్ 8–3తో హనోక్‌పై, శ్రీహరి 8–7 (7)తో రాజుపై, రిషిత్ 8–7 (5)తో ప్రణీత్ రాజుపై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment