TSTA
-
టీఎస్‌టీఏ టోర్నీ డైరెక్టర్‌గా శివకుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) టోర్నమెంట్స్ డైరెక్టర్‌గా జె. శివకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి టోర్నీల నిర్వహణలో అపార అనుభవం కలిగిన రిఫరీ శివకుమార్‌ను డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు టీఎస్‌టీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో శివకుమార్ మినహా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) అధికారిక గుర్తింపును పొందిన రిఫరీలు లేకపోవడం విశేషం. 2005 నుంచి టీఎస్‌టీఏ నిర్వహించే పలు టోర్నీలను ఆయన పర్యవేక్షించారు. -
టీఎస్‌టీఏ అధ్యక్షునిగా వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) నూతన కార్యవర్గం సోమవారం కొలువుదీరింది. ఆదివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో రాబోయే నాలుగేళ్ల కాలానికి గానూ టీఎస్‌టీఏ అధికారుల్ని ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా టెన్నిస్ సంఘానికి చెందిన మద్దినేని వెంకటేశ్వర్లు టీఎస్‌టీఏ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా జగిత్యాల జిల్లా టెన్నిస్ సంఘానికి చెందిన అశోక్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా వి. నారాయణ్ దాస్ (మేడ్చల్ జిల్లా టెన్నిస్ సంఘం), కోశాధికారిగా డి. చంద్రశేఖర్ (రంగారెడ్డి జిల్లా లాన్ టెన్నిస్ సంఘం) నియమితులయ్యారు. కేఆర్ రామన్ (రంగారెడ్డి జిల్లా లాన్‌టెన్నిస్ సంఘం), టి. నరసింగా రెడ్డి (వరంగల్ జిల్లా టెన్నిస్ సంఘం), పుల్లారావు (నల్లగొండ జిల్లా లాన్‌టెన్నిస్ సంఘం), పి. బాల కిషన్ రావు (ఖమ్మం జిల్లా టెన్నిస్ సంఘం) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇతర సభ్యులుగా ఎస్. సతీశ్ రెడ్డి (నాగర్ కర్నూల్), ఎస్. ముకుంద్ రావు (ఆదిలాబాద్), డీఆర్సీ కిరణ్ (మేడ్చల్), జి. యుగంధర్ రెడ్డి (భద్రాద్రి కొత్తగూడెం), సుల్తాన్ ఆసిఫ్ ఇక్బాల్ (మెదక్) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో అఖిల భారత టెన్నిస్ సంఘం సంయుక్త కార్యదర్శి అనిల్ ధూపర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు. -
క్వార్టర్స్‌లో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: అంతర్ రాష్ట్ర పురుషుల టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు నిలకడగా రాణిస్తోంది. ఛత్తీస్‌గఢ్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో భిలాయ్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ టీమ్ విభాగంలో తెలంగాణ క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ తెలంగాణ జట్టు విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ 3–0తో గుజరాత్‌పై గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో తరుణ్ అనిరుధ్ (తెలంగాణ) 6–7 (1–7), 6–1, 6–4తో జై సోనిపై, రెండో సింగిల్స్‌లో పీసీ అనిరుధ్ (తెలంగాణ) 6–0, 6–7 (5–7), 6–4తో ఉదయన్ భాస్కర్‌పై నెగ్గగా... డబుల్స్ మ్యాచ్‌లో అంకం కృష్ణ తేజ– తరుణ్ జంట 6–3, 6–2తో జైసోని– ఉదయన్ భాస్కర్ జోడీపై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో తెలంగాణ 2–0తో మధ్యప్రదేశ్ జట్టును ఓడించింది. తరుణ్ అనిరుధ్ 7–6 (7–4), 6–4తో భవేశ్ గౌర్ (మధ్యప్రదేశ్)పై, పీసీ అనిరుధ్ 6–2, 6–1తో యశ్ యాదవ్ (మధ్యప్రదేశ్)పై గెలుపొందారు. -
ఆకాంక్ష, ప్రతినవ్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టోర్నమెంట్లో ఎం. ప్రతినవ్, ఆకాంక్ష విజేతలుగా నిలిచారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన బాలుర సింగిల్స్ టైటిల్‌పోరులో టాప్‌సీడ్ ప్రతినవ్ 8–6తో వి. కౌషిక్ కుమార్ రెడ్డిపై విజయం సాధించాడు. బాలికల తుదిపోరులో ఆకాంక్ష 8–6తో రహీన్ తరన్నుమ్‌ను ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌ల్లో ఆకాంక్ష 8–3తో అనికా కరంపూరిపై, రహీన్ 8–5తో రిషిక రావుపై, కౌషిక్ కుమార్ 8–1తో లలిత్ మోహన్‌పై, ప్రతినవ్ 8–0తో శ్రీహరిపై విజయం సాధించారు. అండర్–12 బాలబాలికల విభాగాల్లో రహీన్, శ్రీహరి చాంపియన్లుగా నిలిచారు. ఫైనల్లో శ్రీహరి 8–5తో కోట శ్రీనాథ్‌పై, రహీన్ 8–3తో రిషిక రావుపై గెలుపొందారు. అండర్–10 బాలుర సింగిల్స్ టైటిల్‌పోరులో చైత్ర దర్శన్ రెడ్డి 8–0తో ఆకాశ్ సాగర్‌ను చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో మాస్టర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బాలికల ఫైనల్లో థానియా 8–7 (5)తో రిషితా రెడ్డిపై గెలుపొంది విజేతగా నిలిచింది. -
సెమీస్‌లో శరణ్య, రిషిత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ అండర్–12 టోర్నమెంట్లో శరణ్య, రిషిత్ సెమీస్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని డీఆర్సీ స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ శరణ్య 8–4తో తానియాపై గెలుపొందింది. ఇతర మ్యాచ్‌ల్లో రిషిక 8–0తో గీతాంజలిపై, వి. వర్ష 8–6తో యశస్విపై, రహీన్ 8–3తో సం స్కృతిపై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో లలిత్ మోహన్ 8–7 (4)తో కోట శ్రీనాథ్‌పై, అర్మన్ సింగ్ 8–3తో హనోక్‌పై, శ్రీహరి 8–7 (7)తో రాజుపై, రిషిత్ 8–7 (5)తో ప్రణీత్ రాజుపై గెలుపొందారు. -
సెమీస్‌లో ఐరాసూద్, సౌమ్య
మాస్టర్ సిరీస్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం (టీఎస్‌టీఏ) మాస్టర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ఐరాసూద్, సౌమ్య సెమీఫైనల్‌కు చేరుకున్నారు. నేరెడ్‌మెట్‌లోని సెయింట్ థామస్ హైస్కూల్లో శుక్రవారం జరిగిన అండర్–16 బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో ఐరాసూద్ 8–0తో నేహారెడ్డిపై గెలుపొందగా, సౌమ్య 8–0తో కీర్తి ఆనంద్‌ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నిహారిక 8–4తో అనికా కారంపూడిపై, ఆకాంక్ష 8–2తో ఖ్యాతిపై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో రిత్విక్ 8–3తో చక్రవర్తిపై, వేదాంత్ మిశ్రా 8–2తో ఆదిత్యరెడ్డిపై గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. ఇతర తొలిరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు: రోహిత్ సాయిశరణ్ 8–4తో ధ్రువ్‌పై, ప్రతినవ్ 8–1తో ఠాకూర్ ఆర్మాన్ సింగ్‌పై, హేమంత్‌సాయి 8–3తో ఆర్యన్‌పై, సిద్ధాంత్ మిశ్రా 8–2తో రితిక్‌పై, ఆర్నవ్ కుమార్ 8–3తో కోట శ్రీనాథ్‌పై, లలిత్ మోహన్ 8–3తో సనీత్‌పై, కౌశిక్ కుమార్ 8–0తో సంపత్‌పై, వర్షిత్ కుమార్ 8–2తో మోహిత్ సాయి చరణ్ రెడ్డిపై గెలుపొందారు.