సెరెనా x వీనస్ | Serena Williams on Grand Slam after first round win at Wimbledon | Sakshi
Sakshi News home page

సెరెనా x వీనస్

Published Mon, Jul 6 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

సెరెనా x వీనస్

సెరెనా x వీనస్

- నేడు ప్రిక్వార్టర్స్‌లో అమీతుమీ
- వింబుల్డన్ టోర్నీ
లండన్:
ఆదివారం విశ్రాంతి దినం తర్వాత సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు మొదలవుతాయి. సెంటర్‌కోర్టులో తొలి మ్యాచ్‌గా మహిళల సింగిల్స్ విభాగంలో ‘విలియమ్స్ సిస్టర్స్’ సెరెనా, వీనస్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడనున్నారు. ముఖాముఖి రికార్డులో చెల్లెలు సెరెనా 14-11తో అక్క వీనస్‌పై ఆధిక్యంలో ఉంది. 2009 వింబుల్డన్ టోర్నీ తర్వాత వీరిద్దరూ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి.

భారత్ విషయానికొస్తే... సోమవారం సానియా మీర్జా, లియాండర్ పేస్, రోహన్ బోపన్నలు తమ భాగస్వాములతో ప్రిక్వార్టర్ ఫైనల్ డబుల్స్ మ్యాచ్‌లు ఆడనున్నారు. సానియా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం అనాబెల్ మెదీనా-అరంటా పర్రా (స్పెయిన్) జోడీతో; పేస్-నెస్టర్ (కెనడా) జంట అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీతో; బోపన్న-మెర్జియా (రుమేనియా) ద్వయం లుకాస్ కుబోట్ (పోలండ్)-మాక్స్ మిర్నీ (బెలారస్) జంటతో ఆడతాయి


 
సాయంత్రం గం. 4.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4, 2లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement