సమరానికి సఫారీలు వచ్చేశారు...
మూడు ఫార్మాట్‌లలో 72 రోజుల సుదీర్ఘ పర్యటన కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు భారత్‌లోకి అడుగు పెట్టింది. ఆటగాళ్లంతా ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌తో 3 టి20లు, 5 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా తలపడుతుంది.
ఈ నెల 29న సఫారీలు ఢిల్లీలో టి20 వార్మప్ మ్యాచ్ ఆడనుండగా... అక్టోబర్ 2న ధర్మశాలలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. దక్షిణాఫ్రికా వన్డే జట్టుకు డివిలియర్స్, టి20 జట్టుకు డు ప్లెసిస్, టెస్టు జట్టుకు ఆమ్లా సారథ్యం వహించనున్నారు.