రియో ఒలింపిక్స్‌కు సుధా సింగ్ అర్హత
న్యూఢిల్లీ: భారత అగ్రశ్రేణి అథ్లెట్ సుధా సింగ్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ మీట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుధా 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్‌లో 9ని:31.86 సెకన్లలో గమ్యానికి చేరి రజత పతకం సాధించింది.
ఈ క్రమంలో ఆమె ‘రియో’ అర్హత ప్రమాణాన్ని (9ని:45.00 సెకన్లు) అందుకుంది. ఈ మీట్‌లో సుధా రియోకు అర్హత పొందగా... 9ని:27.09 సెకన్లతో స్వర్ణం నెగ్గిన లలితా బాబర్ (మహారాష్ర్ట) గతంలోనే రియో బెర్త్‌ను దక్కించుకుంది.