అలెక్స్ హేల్స్, విలియమ్సన్
జైపూర్ : రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 152 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. భారీ స్కోర్ చేస్తుందనుకున్న సన్‌రైజర్స్‌ను జోఫ్రా ఆర్చర్ (3/26) దెబ్బతీశాడు. దీంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.
విలియమ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (6) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్, అరంగేట్ర ఆటగాడు అలెక్స్ హేల్స్‌లు వేగంగా ఆడుతూ రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 5వ ఓవర్‌లో విలిమ్సన్ క్యాచ్‌ను త్రిపాఠి జారవిడిచాడు. దీంతో ఈ అవకాశాన్ని అందుపుచ్చుకున్న విలియమ్సన్ రెచ్చిపోయాడు. దీంతో 10 ఓవర్లకు సన్‌రైజర్స్ వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. ఉనద్కట్ వేసిన 12 ఓవర్‌లో విలియమ్సన్ మూడు ఫోర్లు, 1 సిక్స్‌తో ఏకంగా 21 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధ సెంచరీ సాధించాడు. ఇక అలెక్స్ హేల్స్(45: 39 బంతుల్లో 4 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే విలియమ్సన్(63; 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్ప్‌లు) సైతం క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
రాజస్తాన్ కట్టడి..
చివర్లో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ షకీబ్ అల్ హసన్(6), యూసఫ్ పఠాన్(2), మనీష్ పాండే(17), రషీద్ ఖాన్(1) వికెట్లు సమర్పించుకున్నారు. చివర్లో సాహా 11(6 బంతుల్లో 1 ఫోర్ నాటౌట్)గా నిలవడంతో సన్‌రైజర్స్ 151 పరుగులు చేసింది. ఇక 20 ఓవర్లలో ఒకే ఒక పరుగు ఎక్స్‌ట్రాగా రావడం విశేషం. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3), గౌతమ్(2), సోధి, ఉనద్కట్‌లు చెరో వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment