
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన జట్టులోని ఆటగాడు పేరు మరిచిపోతే అజింక్యా రహానే సాయం చేశాడు. హైదరబాద్ జట్టులోని ఆటగాడి పేరు చెప్పడంలో విలియమ్సన్ తడబడితే రహానే చెప్పి ఆదుకున్నాడు.
ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి విచ్చేశారు. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కేన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం వ్యాఖ్యాత తుది పదకొండులో చోటు దక్కించుకున్న నలుగురు విదేశీ ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగాడు. దీనికి తనతో పాటు రషీద్ ఖాన్, బిల్లీ స్టాన్‌లేక్‌ల పేర్లు చెప్పిన విలియమ‍్సన్ నాలుగో ఆటగాడి పేరు మరిచిపోయాడు. అతని పేరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. పక్కనే ఉన్న రహానే సాయపడ్డాడు. షకీబ్ ఆల్ హాసన్ అని సూచించాడు. దాంతో విలియమ‍్సన్‌తో పాటు రహానే, వ్యాఖ్యాతల ముఖాల్లో నవ్వులు విరబూశాయి.
Comments
Please login to add a commentAdd a comment