ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు
హెచ్‌సీఏ లీగ్‌లో ఫాతిమా రెడ్డి సంచలనం
సాక్షి, కుత్బుల్లాపూర్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) లీగ్‌లో శ్రీచక్ర బౌలర్ ఫాతిమా రెడ్డి ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా శ్రీచక్ర జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ ఫాతిమా రెడ్డి (21.4-3-55-10) ధాటికి ప్రత్యర్థి జట్టు బాలాజీ కోల్ట్స్ 128 పరుగులకే కుప్పకూలింది. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీచక్ర జట్టు 56 ఓవర్లలో ఏడు వికెట్లకు 204 పరుగులు చేసింది. రఘు (101) సెంచరీ చేశాడు.