ప్రపంచకప్‌: కివీస్‌ హ్యాట్రిక్‌ సాధించేనా? | World Cup 2019 New Zealand Opt To Bowl First Against Afghanistan | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌: కివీస్‌ హ్యాట్రిక్‌ సాధించేనా?

Published Sat, Jun 8 2019 6:27 PM | Last Updated on Sat, Jun 8 2019 6:49 PM

World Cup 2019 New Zealand Opt To Bowl First Against Afghanistan - Sakshi

టాంటన్‌: రెండు విజయాలు, నాలుగు పాయింట్లు, మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న న్యూజిలాండ్‌... రెండు పరాజయాలు, సున్నా పాయింట్లు, మైనస్‌ రన్‌రేట్‌తో అట్టడుగున ఉన్న అఫ్గానిస్తాన్‌ మధ్య ఈ రోజు ఆసక్తికర మ్యాచ్‌ జరగుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి విలియమ్సన్‌ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు. దీంతో అఫ్గాన్‌ బ్యాటింగ్‌కు దిగింది. అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు లేకుండానే కివీస్‌ బరిలోకి దిగుతోంది. కానీ అఫ్గాన్‌ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. 

బౌలింగ్‌ బలంగా ఉన్నా, బ్యాటింగ్‌లో మంచి ఇన్నింగ్స్‌లు లేకపోవడంతో అఫ్గాన్‌ ఏమీ చేయలేకపోతోంది. దీనికితోడు వికెట్‌ కీపర్‌ మొహమ్మద్‌ షెహజాద్‌ గాయంతో ప్రపంచకప్‌కే దూరమవడం వారికి దెబ్బే. స్పిన్‌ను సమర్థంగా ఆడే రాస్‌ టేలర్‌ కివీస్‌కు పెద్ద భరోసా. అఫ్గాన్‌ బౌలర్ల దెబ్బకు మిగతా బ్యాట్స్‌మెన్‌ తడబడినా టేలర్, కెప్టెన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించగలరు. అయితే, మిస్టరీ స్పిన్నర్లున్న అఫ్గాన్‌... ప్రత్యర్థిని ఇబ్బందిపెట్టినా ఆశ్చర్యం లేదు. పేస్‌కు కొంత అనుకూలించినా స్ట్రయిట్‌ బౌండరీలు చిన్నవి కావడంతో టాంటన్‌ మైదానం భారీ స్కోర్లకు పేరుగాంచింది. 

తుది జట్లు:
అఫ్గానిస్తాన్‌: గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), హజ్రతుల్లా, నూర్‌ అలీ జద్రాన్, రహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిది, మొహమ్మద్‌ నబీ, నజీబుల్లా జద్రాన్‌, ఇక్రామ్‌, రషీద్‌ ఖాన్‌, ఆఫ్తాబ్‌ ఆలమ్, హమీద్‌ హసన్.

న్యూజిలాండ్‌: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), మార్టిన్‌ గప్టిల్‌, కోలిన్‌ మున్రో, రాస్‌ టేలర్‌, టామ్‌ లాథమ్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్రాండ్‌ హోమ్‌, సాంట్నర్‌, మ్యాట్‌ హెన్రీ, ఫెర్గుసన్‌, ట్రెంట్‌​ బోల్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement