రెజ్లింగ్ పోటీలు ప్రారంభం | wrestling games started in telangana | Sakshi
Sakshi News home page

రెజ్లింగ్ పోటీలు ప్రారంభం

Published Sat, Nov 5 2016 10:41 AM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

wrestling games started in telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రెజ్లింగ్ చాంపియన్‌షిప్ శుక్రవారం ప్రారంభమైంది. ఫలక్‌నుమా డివి జన్ పోలీసుల ఆధ్వర్యంలో బార్కాస్ స్పోర్‌‌ట్స ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ ప్రారంభిం చారు. ఈ పోటీల్లో పలు అకాడమీలకు చెందిన ప్రము ఖ రెజ్లర్లు పాల్గొననున్నారు. యువకుల్లో ప్రతిభను వెలికి తీయడానికి ఈ చాంపియన్‌షిప్ ఉపయోగపడుతుందని డీసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.

 

నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చాంద్రాయణ గుట్ట, ఛత్రినాక, శాలిబండ, ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్లర్లు, పలువురు పహిల్వాన్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement