ఢిల్లీని అన్నపూర్ణగా మారుస్తాం
Published Sat, Aug 24 2013 11:02 PM | Last Updated on Sat, Aug 25 2018 5:20 PM
న్యూఢిల్లీ: ఆహార భద్రత పథకాన్ని సమర్థవంతగా అమలు చేసి రాజధాని నగరాన్ని అన్నపూర్ణగా మారుస్తామని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పునరుద్ఘాటించారు. నగరంలోని 73 లక్షల మందికి తక్కువ ధరకే నిత్యావసరాలు అందజేస్తామని, పథకం అమలును సవాలుగా తీసుకొని పనిచేస్తామన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును ఢిల్లీలో ఈ నెల 20న యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ప్రారంభించిన విషయం తెలిసిందే. నగరంలో 18వ ఆప్‌కీ రసోయి కేంద్రాన్ని శనివారం ప్రారంభించిన సందర్భంగా షీలాదీక్షిత్ మాట్లాడుతూ...‘నగరాన్ని ఆకలి రహిత నగరంగా మారుస్తామ’న్నారు.
Advertisement
Advertisement