ధనుష్ అభిమానులకు డబుల్ ధమాకా! | Confirmed: Dhanush-Starrer 'Anegan' to Release on 14 February | Sakshi
Sakshi News home page

ధనుష్ అభిమానులకు డబుల్ ధమాకా!

Published Wed, Jan 14 2015 2:43 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

ధనుష్ అభిమానులకు డబుల్ ధమాకా! - Sakshi

ధనుష్ అభిమానులకు డబుల్ ధమాకా!

నటుడు ధనుష్ 2014 చివర్లో వేల ఇల్లాద పట్టదారి(రఘువరన్ బిటెక్) చిత్రంతో పెద్ద విజయాన్ని ఇచ్చి అభిమానుల్ని సంతోషపరిచారు. 2015 ప్రథమార్థంలోనే డబుల్ ధమాకాతో అభిమానుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఒకటి అనేగన్ చిత్రం, రెండోది షమితాబ్ చిత్రం. ఈ రెండు చిత్రాలు వారం గ్యాప్‌లో వరుసగా విడుదలకు సిద్ధం కానున్నాయి.

ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ అమిరా దస్తూర్ జత కట్టిన అనేగన్ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు. హరిష్ జయరాజ్ సంగీత బాణీలను అందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించింది. ఇందులో ధనుష్ పలు గెటప్‌లలో తన అభిమానుల్ని ఉర్రూతలూగించనున్నారు. ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న తెర మీదకు రానుంది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ రెండో కూతురు అక్షర హాసన్ తొలిసారి హీరోయిన్‌గా పరిచయమవుతూ, ధనుష్‌తో జతకడుతున్న హిందీ చిత్రం షమితాబ్.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తుండడం విశేషం. హిందీలో అమితాబ్‌బచ్చన్‌తో ఁపారూ., సినీకాం వంటి వైవిధ్య భరిత సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన బాలీవుడ్ దర్శకుడు బాల్కీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ఇది. ధనుష్ హీరోగా హిందీలో పరిచయమైన రాంజన  విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో షమితాబ్ కూడా ధనుష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ రెండు చిత్రాలు ధనుష్ అభిమానులకు నిజంగా డబుల్ ధమాకానే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement