బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం | Girl raped by an unidentified man | Sakshi
Sakshi News home page

బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం

Published Wed, Nov 12 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం

బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం

మంఢ్య : బెంగళూరు నగరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తి  అత్యాచారం చేసి పారిపోయిన సంఘటణ సోమవారం రాత్రి పాండవపుర తాలూకాలోని నీలనహళ్ళి గేట్ సమీపంలోని చోటు చేసుకుంది. పాండవపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బెంగళూరులోని ఒక ప్రవేట్ పాఠశాల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక సోమవారం తన తల్లిదండ్రులతో గొడవ పడి మైసూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అయితే తిరిగి ఇంటికి వెళ్లడానికి ఆదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ఆ స్టేషన్‌లో రైలు కోసం వేచిచూడసాగింది.
 
 ఆ బాలికను చూసిన గుర్తు తెలియని వ్యక్తి (40)  తనను ఇంటి దగ్గర వదిలిపెడతానంటూ తన వాహనంలో తీసుకెళ్లాడు. పాండవపుర సమీపంలోని  నీలనహళ్ళి గేట్ వద్దకు చేరుకొని రాత్రి సుమారు ఏడు గంటల సమయంలో ఆ బాలికపై అత్యాచారం చేశారు. అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అనంతరం ఆ బాలిక అక్కడి నుంచి కిలో మీటరు దూరాన్ని చీకటిలో నడుచుకుంటూ సమీపంలోని మహదేశ్వర గ్రామానికి చేరుకుంది. ఆ గ్రామస్తులకు జరిగిన సంఘటన చెప్పి బోరున విలపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు.  మెరుగైన చికిత్స కోసం ఆ బాలికను మండ్య జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement