
స్మార్ట్ కార్డుపై ముద్రించిన కాజల్ అగర్వాల్ ఫొటో
హొసూరు : తమిళనాడు ప్రభుత్వం రేషన్ కార్డులకు బదులుగా అందజేస్తున్న స్మార్ట్‌కార్డులో కుటుంబ యజమాని ఫొటో బదులుగా హీరోయిన్ ఫొటోను ముద్రించా రు. ఈ సంఘటన సేలం ప్రాంతంలో జరిగింది.
సేలం జిల్లా ఓమలూరు తాలూక కామలాపురం గ్రామానికి చెందిన పెరియతంబి భార్య సరోజ (67). వీరికి గత నెలలో రేషన్‌కార్డుకు బదులుగా స్మార్ట్‌కార్డు వచ్చిందని, సమీపంలోని రేషన్ దుకాణంలో కార్డును తీసుకెళ్లాలని తెలిపారు. దీంతో సరోజ రేషన్ దుకాణానికెళ్లి స్మార్ట్ కార్డును తీసుకోగా అందులో సరోజ ఫొటోకు బదులుగా సినీ నటి కాజల్ అగర్వాల్ ఫొటోను ఉంది.