ముంబై: ఇంకా అమలులోకి రాని రెంట్ యాక్ట్ (అద్దె చట్టం)లో భారీ వాణిజ్య, నివాస సముదాయాలకు మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. భూ యజమాని మార్కెట్ రేటు ప్రకారం అద్దె వసూలు చేయకుండా ఉండేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ విషయంపై ఓ హౌసింగ్ శాఖ అధికారి మాట్లాడుతూ.. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్ మెహతా, గృహ నిర్మాణ ప్రధాన కార్యదర్శి సతీష్ గవయ్‌కి మధ్య అంతర్గత విభేదాలున్నాయన్నారు.
దీంతో చట్టం చేసే సమయంలో మంత్రికి ఏవిధమైన సమాచారం అందించలేదని చెప్పారు. ప్రస్తుత అద్దె చట్టం గురించి మంత్రికి వివరించలేదన్నారు. 1996 మే 1 నుంచి సుప్రీంకోర్టులో ఈ విషయమై కేసు నడుస్తోందని, 16 మంది న్యాయమూర్తులు ఈ కేసును విచారిస్తున్నారని, కోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు చట్టాన్ని ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
నిబంధనలివే..!
500 చదరపు అడుగుల కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న వాణిజ్య సముదాయాలు, 862 చదరపు అడుగుల కన్నా ఎక్కువ వైశాల్యం ఉన్న గృహ సముదాయాలు ఈ చట్టం పరిధిలోకి రావు. అయితే 46.5 చదరపు అడుగులు ఉన్న వాణిజ్య సముదాయాలు, 80 చదరపు అడుగులు ఉన్న గృహ సముదాయాల్లో రేట్ మాన్యువల్‌లో ఉన్న ప్రకారం చెల్లించి ఆ అద్దె ప్రాంతాన్ని వాడుకోవచ్చు. యజమాని అకస్మాత్తుగా అద్దె పెంచకుండా చట్టంలో నిబంధన పొందుపరిచారు.
ఆ ప్రకారం మొదటి మూడుళ్లు ఇల్లు అద్దెకు తీసుకున్న వ్యక్తి మార్కెట్ రేటు ప్రకారం అద్దె 50 శాతం చెల్లిస్తాడు. నాలుగో ఏడాది నుంచి 100 శాతం అద్దె చెల్లిస్తాడు. అద్దెదారుని వార్షిక ఆదాయంలో 30 శాతం కంటే ఎక్కువ అద్దె వసూలు చేయకూడదు. అలగే సీనియర్ సిటిజన్లు వారి వార్షిక ఆదాయంలో 15 శాతం కానీ, మార్కెట్ ప్రకారం ఉన్న అద్దెలో 50 శాతంలో తక్కువ ఉన్న మొత్తాన్ని చెల్లిస్తారు.
అద్దె చట్టంలో ‘భారీ’ మినహాయింపు
Published Sun, May 3 2015 11:52 PM | Last Updated on Sun, Sep 3 2017 1:21 AM
Advertisement
Advertisement