సాక్షి, ముంబై: ‘టీ’ పునః నిర్మాణంలో ముంబైకర్లు చురుకైన పాత్ర నిర్వహించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకుడు సిర్ప గంగాధర్(హైదరాబాద్) సూచించారు. శనివారం రాత్రి ‘టీ’ పునఃనిర్మాణంలో ముంబైకర్లు పాత్ర అనే అంశంపై ముంబైలోని భూపేష్ గుప్తా భవనంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ముంబైలోని తెలంగాణ పారిశ్రామికవేత్తలు తమ సొంత గ్రామాల్లో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం మెరుగుర్చాలని కోరారు.
తెలంగాణ సాధనలో ముంబై టీ ఐకాస సభ్యులు కీలక పాత్ర నిర్వహించారని ప్రశంసించారు. టీ జేఏసీ సభ్యులు తెలంగాణ ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై బాగా స్పందిస్తున్నారని, ఇటీవలే రైళ్ల ప్రారంభానికి వారి ఆందోళనలే కారణమని ప్రముఖ తెలంగాణావాది, గౌరవాధ్యక్షుడు జి.రాందాస్ పద్మశాలి (యస్‌సి) పేర్కొన్నారు. సదస్సు లో అవినీతి నిరోధక శాఖ పోలీస్ అధికారి శశి కాంత్ చెర్లవార్, భీవండి సమాజసేవకులు బాబు రావుబైరి లతోపాటు ముంబై టీ ఐకాస చైర్మన్ మూల్‌నివాసి మాల అధ్యక్షత వహించారు. ముంబై టీ ఐకాస వైస్ చైర్మన్ కె.నర్సింహగౌడ్, కన్వీనర్లు దేవానంద్, లక్ష్మణ్ మాదిగ, శ్రీనివాస్ రజక్, ‘నవోదయ కళామంచ్’ కళాకారులు తమ పాటలతో ఉర్రూతలూగించారు.
‘తెలంగాణ’లో ముంబైకర్ల పాత్ర ఉండాలి
Published Sun, Mar 2 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement