సీఎం త్వరగా కోలుకోవాలి: సూపర్‌స్టార్ | Rajinikanth wishes jayalalithaa to recover soon | Sakshi
Sakshi News home page

సీఎం త్వరగా కోలుకోవాలి: సూపర్‌స్టార్

Published Sat, Sep 24 2016 8:42 AM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM

సీఎం త్వరగా కోలుకోవాలి: సూపర్‌స్టార్ - Sakshi

సీఎం త్వరగా కోలుకోవాలి: సూపర్‌స్టార్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరడంతో.. ఆమె త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో శనివారం ఉదయమే ఒక పోస్ట్ పెట్టారు. ప్రియతమ ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని అందులో ఆయన పేర్కొన్నారు.

ఈనెల 21వ తేదీన మెట్రోరైలు రెండోదశ ప్రారంభం, కొత్తగా సిటీ బస్సులను ప్రవేశపెట్టడం వంటి అనేక కార్యక్రమాల్లో జయలలిత పాల్గొన్నారు. మర్నాడు ఆమె సచివాలయానికి వెళ్లలేదు. అదే రోజు రాత్రి ఆమె జ్వరం బారిన పడ్డారు. అర్ధరాత్రి జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో సీఎంను చెన్నై గ్రీమ్స్‌రోడ్డులో అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమె కోలుకుంటున్నారు. జయలలిత ఆరోగ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. ఆమె పూర్తిస్థాయిలో కోలుకోగానే డిశ్చార్జి చేస్తామని అపోలో ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement