తనకు దక్కదన్న అనుమానంతో...
ఇతరులతో సన్నిహితంగా మాట్లాడుతోందన్న చిన్న అనుమానంతో ఒక కిరాతకుడు ఆ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు.
సిద్దిపేట రూరల్ : తాను పెట్టుకున్నది అక్రమ సంబంధమే కాకుండా అమ్మాయి ఇతరులతో సన్నిహితంగా మాట్లాడుతోందన్న చిన్న అనుమానంతో ఒక కిరాతకుడు ఆ మహిళను అత్యంత దారుణంగా హతమార్చాడు. తనతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తూ మరొకరితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో మహిళను హత్య చేసిన ఘటనను పోలీసులు చేధించారు.
సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామానికి చెందిన దండ్ల లావణ్య (28) ఈ నెల 9 న దారుణ హత్యకు గురైంది. లావణ్య భర్త కొంతకాలంగా గల్ఫ్ దేశంలోని ఖత్తర్‌లో కూలీ పనిచేస్తున్నాడు. గ్రామంలో ఇంటి వద్దనే ఉంటున్న లావణ్యకు అదే గ్రామానికి చెందిన రంగు పర్శరాములు గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. మూడేళ్లుగా వారిమధ్య సాన్నిహిత్యం కొనసాగుతోంది. గత కొంత కాలంగా లావణ్య తనను పట్టించుకోవడం లేదనీ, ఇతర వ్యక్తులతో మాట్లాడుతోందన్న అనుమానం పర్శరాములు పెంచుకున్నాడు.
దాంతో పర్శరాములు, ఎలాగైనా లావణ్యను అంతం చేయాలన్ననిర్ణయానికి వచ్చి దానికో ప్రణాళిక వేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 9న లావణ్యకు ఫోన్ చేసి ఎప్పుడు కలుసుకునే స్థలానికి రావాలని సూచించాడు. అలాగే పతకం ప్రకారమే పర్శరాములు గొడ్డలి తీసుకొని అక్కడికి వెళ్లాడు. అప్పటికే లావణ్య అక్కడికి రావడంతో ఇరువురు మాట్లాడుతుండగా లావణ్యకు ఫోన్ వచ్చింది. ఫోన్ రావడంతో అనుమానించిన పర్శరాములు తనతో తెచ్చుకున్న గొడ్డలితో ఆమె మెడపై బలంగా నరకడంతో ఆమె కేకలు వేస్తూ అక్కడే కుప్పుకూలింది.
ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకున్నాడు. కాళ్ల కడియాలు తీసేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో కాళ్ల పాదాలు నరికి వేరుచేసి వాటిని కూడా తీసుకున్నాడు. అనంతరం లావణ్య శవాన్ని ఆ ప్రాంతంలోని మొక్కజొన్న తోటలో ఉన్న చీరలో ఆమెను మూటకట్టి బైక్‌పై తీసుకెళ్లి గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద ఓ గుంతలో పడేశాడు. ఊర్లో ఉంటే అనుమానం వస్తుందేమోనని పారిపోయాడు.
ఇదిలా ఉంటే గురువారం రూరల్ సీఐ సైదులు, రాజగోపాల్‌పేట ఎస్‌ఐ శ్రీనివాస్‌లు ఎన్సాన్‌పల్లి శివారు వద్ద వాహానాలు తనిఖీ చేస్తుండగా దొమ్మాట వైపు నుంచి వచ్చిన పర్శరాములుగౌడ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకొని పై విధంగా వివరాలు వెల్లడించినట్లు ఏసీపీ వివరించారు. గురువారం సిద్దిపేట ఏసీపీ నర్సింహారెడ్డి తన కార్యాలయంలో నిందితున్ని రిమాండ్‌కు చూపిస్తూ మీడియాకు వివరాలను వెల్లడించారు. నిందుతుని వద్ద నుంచి బంగారు గొలుసుతో పాటు కళ్లకడియాలు స్వాదీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు పర్శరాములుపై 302, 376, 379, 201 సెక్షన్‌ల కింద కేసు నమోదు రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. లావణ్య అతి కిరాతకంగా నరికి చంపిన పర్శరాములుపై రౌడీషిట్ ఒపెన్ చేయనున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఏసీపీ అభినందించారు.