-
రేవంత్‌రెడ్డీ.. చరిత్ర తిరగేసుకో!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను అంతం చేస్తామని గత 24 ఏళ్లలో ఎంతో మంది పిచ్చి ప్రేలాపనలు చేశారని.. వారంతా ఎక్కడున్నారో చరిత్రలోకి తొంగిచూస్తే రేవంత్‌రెడ్డికి తెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ నడుము బిగించకపోతే ఇవాళ సీఎంగా రేవంత్‌రెడ్డి ఉండేవారా? అని ప్రశ్నించారు. అధికారం, పదవు లు తాత్కాలికం, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవడం ఒక్కటే శాశ్వతమని.. అది కేసీఆర్‌కు మాత్రమే సొంతమని చెప్పారు. శనివారం రాజేంద్ర నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు మల్లాద్రి నాయుడు, షేక్ అరిఫ్, వారి అనుచరులు తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీ ఆర్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీఎం రేవంత్‌రెడ్డికి కొన్ని సాంకే తిక సమస్యలు ఉన్నాయి. ఎత్తయిన కుర్చీలు, లేదంటే రెండు కుర్చీలు వేసుకు ని కూర్చుంటున్నారు. ఎత్తయిన కుర్చీలో కూర్చుంటే పెద్దోడివి అయిపోవు రేవంత్‌రెడ్డీ.. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు. బీఆర్ఎస్ అంటే సామాన్య శక్తి కాదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల ప్రజల్లో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కేసీఆర్ పాలన సాగించారు. అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పదవుల కోసం పార్టీని వదిలిపోయినా.. పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న గులాబీ సైనికులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. దేవుళ్లను మోసం చేసిన తొలి వ్యక్తి రేవంత్.. సీఎం రేవంత్ రైతు భరోసా కింద ఎకరానికి రూ. 15 వేలు ఇస్తా అన్నారు. దాని కోసం రాష్ట్ర రైతాంగం ఎదురుచూస్తోంది. మూడు పంటలకు రైతు భరోసా ఎక్కడ పోయింది. వానాకాలం రైతుబంధు ఇంకా ఖాతాల్లో పడలేదు. మోసపోయామని రైతు లు బాధపడుతున్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తా మని చెప్పి మోసం చేశావు. రేవంత్ ఏ దేవుడి వద్దకు వెళ్తే అక్కడ ఒట్లు పెట్టారు. మనుషులను మోసం చేసిన వారున్నారు. కానీ దేవుళ్లను మోసం చేసిన తొలి వ్యక్తి రేవంతే. పంద్రాగస్టులోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీశ్‌రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది రుణమాఫీ? జేపీ దర్గా వద్ద కూడా ఒట్టు పెడితివి. నీ ఒట్లకు మెదక్ చర్చిలో యేసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు. గాడ్సే వారసుడు గాంధీ విగ్రహం పెడతాడట! మూసీ గురించి మేం గట్టిగా అడిగితే బాపూఘాట్ వద్ద అతిపెద్ద మహాత్మాగాంధీ విగ్రహాన్ని పెడతామ ని రేవంత్‌రెడ్డి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గాంధీకి విగ్రహాలు ఇష్టం ఉండవని.. అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మాగాంధీ మన వడు సూచించారు. కానీ గాడ్సే వారసుడు రేవంత్‌రెడ్డి గాంధీ విగ్రహం పెడతానని అంటున్నారు. మహాత్ముడి విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదు. ఇచ్చి న హామీలు, సంక్షేమ పథకాలకు పైసలు లేవుగానీ.. మూసీకి రూ.లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తారట. ఆ మూసీ మూటల్లో మీ వాటా ఎంతో చెప్పాలి. హైదరాబాదీలు మోసపోలేదు.. ఇవాళ హైదరాబాద్ ప్రజల చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ల్లో కొందరు మోసపోయారు. కాంగ్రెస్ వాళ్ల మాట లు, వ్యవహారం తెలుసు కాబట్టి హైదరాబాద్ వాళ్లు మాత్రం మోసపోలేదు. 24 నియోజకవర్గాల్లో చైతన్యాన్ని చూపించి బీఆర్ఎస్ను గెలిపించారు. పార్టీ వీడిన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. కార్యకర్తలంతా పార్టీని వెన్నంటే ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున కొట్లాడి.. వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఆ అవకాశం కార్తీక్‌రెడ్డికి వచ్చి ంది. ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే.. అంత మేలు జరుగుతుంది’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు
సాక్షి ప్రతినిధి, వరంగల్: వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆ పార్టీ కి నూకలు చెల్లాయని, పదేళ్ల పాలనలో యథేచ్ఛగా నీళ్లు, నిధులు, భూములు దోపిడీ చేసిన బీఆర్ఎస్ ను ప్రజలు 2023లో గద్దె దించారని పేర్కొన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో జరిగింది అభివృద్ధి కాదు.. మొత్తం అన్యాయమేనని, దీనిపై తాము చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ నేతలకు ఆయన సవాల్ విసిరారు.19న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం హనుమకొండకు విచ్చేసిన టీపీసీసీ చీఫ్ ముందుగా నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ ప్రముఖులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రా న్ని బీఆర్ఎస్ అప్పుల తెలంగాణగా మార్చిందని, ప్రత్యేక రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్ర మే బంగారుమయం అయ్యిందని.. పేదలు అష్టకష్టాలు పడ్డారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రతిపక్ష హోదాను నిర్వర్తించకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యాడని విమర్శించారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ.. తెలంగాణలో ఉనికి కోసం కులం, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యతి్నస్తున్నదన్నారు. మూసీ ప్రక్షాళన అవసరమా, కాదా? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేయాలన్నారు. కులగణనతో దేశానికే రోల్‌మోడల్.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీన హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కాలేజీ మైదానంలోని ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంలో లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు మహేశ్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పది నెలల రేవంత్‌రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి నేపథ్యంలో నిర్వహించనున్న ఈ సభ చరిత్రాత్మకంగా నిలవబోతుందన్నారు. రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ట్రంలో కులగణన చేపడుతోందని, కులగణనతో తెలంగాణ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోయి అసహనంతో మాట్లాడుతున్నాడని, తాను జైలుకు పోవడం ఖాయమని కేటీఆర్‌కు తెలిసిపోయిందని చెప్పారు. అనంతరం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో సభాస్థలిని పరిశీలించారు.సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు డాక్టర్ కడియం కావ్య, పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, డాక్టర్ మురళీనాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్‌ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
లగచర్ల ఘటన కుట్ర కాదు.. తిరుగుబాటు: పైలట్ రోహిత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్:లగచర్ల ఘటన రైతుల బాధతో జరిగిన తోపులాటే కానీ కుట్ర కానే కాదని బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శనివారం(నవంబర్ 16) ఈ విషయమై రోహిత్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘లగచర్ల గ్రామం చుట్టుపక్కల పచ్చని పంటపొలాలు,అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి.ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తోంది. దాడి జరిగిన రోజు కలెక్టర్‌కు పోలీసులు భద్రత ఎందుకు కల్పించలేదు. బాధతో తిరగబడితే రైతులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు.బీఆర్ఎస్ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీకి కొత్తగా భూసేకరణ ఎందుకు.జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడం వెనుక మహేందర్ రెడ్డి హస్తం ఉంది.నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి.పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్‌రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి,చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి’అని రోహిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లే ఫినిష్ అయ్యారు -
మూసీమే లూటో.. ఢిల్లీలో బాటో: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ పేరుతో సంపాదించిన డబ్బుల మూటలను ఢిల్లీకి తరలించడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అలాగే, మూసీమే లూటో.. ఢిల్లీలో బాటో.. రేవంత్ బాసులు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. వాళ్లకు డబ్బులు పంపిస్తారు అని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ వల్లే మూసీ పాడైపోయినట్లు రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన కోసం లక్షా యాభై వేల కోట్లు కేటాయించారు దేని కోసం?. ఎవరి కోసం లక్షా యాభై వేల కోట్లు?. బఫర్ జోన్లో పర్మిషన్లు ఇచ్చి.. మీరే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇళ్లు కూలగొట్టి మాల్స్‌కు ఇస్తామంటున్నారు. మూసీమే లూటో.. ఢిల్లీలో బాటో.. రేవంత్ బాసులు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి.. వాళ్లకు డబ్బులు పంపిస్తారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే!. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అన్నవాళ్లే ఫినిష్ అయ్యారు. కేసీఆర్ తెలంగాణ కోసం కొట్లాడకపోతే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవాడా?. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం శాశ్వతం. రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లను కూడా మోసం చేశారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి’ అని కామెంట్స్ చేశారు. -
మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్‌కు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారంటీలు, హామీలను అమలు చేయకుండా.. మహారాష్ట్రలో అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఏ మొహం పెట్టుకుని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పాలన మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్ పారీ్టకి అన్నట్టుగా తయారైంది.తెలంగాణలో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ యాత్రలు చేసి.. ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ పాలన నడుస్తోంది. రేవంత్ వ్యవహారం, దోపిడీ, అబద్ధాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ సమాజాన్ని అవమానించే మాటలు.. అచ్చం కేసీఆర్ మాదిరిగానే సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల డీఎన్ఏ ఒకటే. ఒకరిపై మరొకరు డూప్ ఫైటింగ్ చేయడం వారికి అలవాటే. రాష్ట్ర ప్రభుత్వం విఫలం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. వ్యాపార రంగం విశ్వాసం కోల్పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికీ పైసల్లేవు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచలేదు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. కానీ కొత్త ఉద్యోగాలు ఇచ్చామంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు భారాన్ని కేంద్రమే భరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లలో విఫలమైంది. రైతులకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచి్చంది. కానీ 15 పైసలు కూడా ఇవ్వలేదు. రైతులకు ధాన్యంపై బోనస్ లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా విలేజీకి భూసేకరణ విషయంలో కలెక్టర్‌పై దాడి, రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించేంతగా రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. మూసీని కొబ్బరినీళ్లలా మారుస్తామన్న కేసీఆర్.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చడం, నల్లగొండలో రైతులను రెచ్చగొట్టడం తప్పితే చేసిందేమీ లేదు. పేదల ఇండ్లు కూల్చొద్దంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి.. పేదల ఇళ్లు కూల్చకండి.. ఇదే మా డిమాండ్. మూసీ పరిసర ప్రాంతంలో ఒక్క రోజు నిద్రపోండి అని సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. శనివారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిద్ర చేయబోతున్నాం. ప్రజలతో కలసి వారి ఇంట్లోనే భోజనం చేసి, అక్కడే నిద్ర చేస్తాం. పోలీసు వ్యవస్థ నిర్విర్యం రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసింది. మజ్లిస్ పార్టీ, అసదుద్దీన్, రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.’’అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్మా సిటీ ఒక్కచోట ఉండకూడదనే వికేంద్రీకరణ చేశామని చెప్పారు. లగచర్లలో భూమిలేని వారు అధికారులపై దాడి చేశారని, కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా దాడి జరిపించాడని ఆరోపించారు. ఫార్ములా వన్ రేసులో చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని, ఆయన తప్పు చేశాడని ఫీలవుతున్నాడు కాబట్టే జైలుకుపోతా అంటున్నాడని తెలిపారు.ఈ మేరకు శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపడం లేదేంటని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అధికారులపై పద్దతి ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రతిపక్షహోదా ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిగా బయటకు రావడం లేదన్నారు. ఆయన ఎక్కడ దాకున్నారని ఆయన ప్రశ్నించారు.‘కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కంటే మేము 9 నెలల్లో ఎక్కువ చేశాం. నిర్బంధ పాలన నుంచి ప్రజా పాలన తీసుకొచ్చాం. అందుకే బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప్రజలు కోరినట్లు పాలన సాగింది కాబట్టే విజయోత్సవాలు చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోని అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయి.హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి ఒక వరం. ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పూర్తిగా బాగు చేస్తే.. వయనాడ్‌లో చోటుచేసుకున్న ఉపద్రవాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూసీ ప్రక్షాళన అవసరం. పేదలెవరూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటుంది’ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. -
ఏఐసీసీలో ఖర్గే ఓ బొమ్మ మాత్రమే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: శీతాకాల సమావేశంలో వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుందని అన్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదని తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో వక్ఫ్ మతం కిందకు రాదని చెబుతున్నాయని,. వక్ఫ్ అనేది ఇతర దేశాల్లో ప్రభుత్వం కిందనే ఉందని తెలిపారు. ఎవరడ్డుకున్నా వక్ఫ్ బోర్డు సవరణ జరుగుతుందని చెప్పారు.ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కీలకమని.. ఎవరైనా సర్వోన్నత న్యాయస్థాన తీర్పును గౌరవించాల్సిందేనని అన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. దీనికి సుప్రీంకోర్టుకు మించి అధికారలిచ్చారని విమర్శించారు. ఔరంగజేబు విధానాలు ఇప్పటికీ ప్రజలను పీడిస్తున్నాయని పేర్కొన్నారు.‘300 వందల ఏళ్ల క్రితం కింద ఔరంగా జేబు నోటి మాటతో భూములిచ్చి ఉండొచ్చు, కానీ నేడు కుప్పలువుకుప్పలుగా డాక్యుమెంట్స్‌తో భూములు మావని అంటున్నారు. వక్ఫ్ బోర్డు అనేది ఒక క్రూరమైన హాస్యం, నవ్వాలో, ఏడ్వాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. దేవాలయం అనేది మతానికి సంధించింది. వక్ఫ్ ఆనేది సమాజానికి సంబంధించినది.ముస్లిం ఓట్ల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ దేశాన్నైనా అమ్ముకుంటాయి. ఏఐసీసీలో ఖర్గే ఒక బొమ్మ మాత్రమే. నాడు మన్మోహన్ సింగ్‌ను ఎలా వాడుకున్నారో నేడు ఖర్గే కూడా అలాగే వాడుకుంటున్నారు.రాహుల్ తాత నెహ్రూ హాయంలో పాలేకర్ కమిషన్ ఏర్పాటు చేశారు. 1980 మండల్ కమిషన్ ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు లేవు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ విధానాలు నచ్చక అంబేద్కర్ కేబినెట్ వదిలేసి వెళ్లిపోయారు.రాజ్యాంగాన్ని బొంద పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది’ అని మండిపడ్డారు. -
పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు రిజిస్ట్రీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు(శుక్రవారం) కోర్టుకు సెలవు కావడంతో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డి.. నేరస్తులతో కలిపి ఉంచారని పిటిషన్ వేశారు. స్పెషల్ బ్యారక్‌లో పట్నం నరేందర్‌ను ఉంచాలని న్యాయవాది కోరారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు రిజిస్ట్రీ రిజక్ట్ చేసింది.లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ కేసులో నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఆయనను పోలీసులు అదుపులో తీసుకున్నారు. అక్కడి నుంచి వికారాబాద్‌లోని పోలీస్ ఆఫీస్‌కు, తర్వాత జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. రిమాండ్రిపోర్టులో ఆయనను ఏ1గా చేర్చారు.కన్ఫెషన్ స్టేట్మెంట్లో తానే సురేష్‌తో దాడి చేయించానని, ఆర్థికంగా సహకరించారనని నరేందర్‌రెడ్డి ఒప్పుకోవడంతో ఏ1గా ఆయనను చేర్చినట్లు, ఏ2గా సురేష్‌ను మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు వరకు సురేష్ పేరు ఏ1గా ఉండేది. బుధవారం సాయంత్రం కొండగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట నరేందర్‌రెడ్డిని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా, కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన పాత్ర ఉందంటూ పోలీసులు కట్టు కథ అల్లారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాలతో రైతులను దాడులకు పురికొల్పినట్లుగా తాను నేరాంగీకార ప్రకటన ఇచ్చానని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డి.. ఈ మేరకు గురువారం తన న్యాయవాదుల ద్వారా కొడంగల్ కోర్టును ఉద్దేశించి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న తనను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు.ఆ తర్వాత పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టుకు తీసుకెళ్లారన్నారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత లగచర్ల ఘటనలో తాను ప్రథమ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. తన అరెస్టు విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు సమాచారాన్ని కనీసం తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఇవ్వలేదని తెలిపారు. తాను అఫిడవిట్లో పేర్కొన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. -
సింపతీ కోసమే కేటీఆర్ అరెస్ట్ డ్రామా: శ్రీధర్ బాబు
సాక్షి, సచివాలయం: ప్రజల్లో సానుభూతి కోసమే కేటీఆర్ పదే పదే అరెస్ట్ అంటూ మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. లగచర్ల ఘటనలో కలెక్టర్‌ను చంపే కుట్ర జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలని డిమాండ్ చేశారు.మంత్రి శ్రీధర్ బాబు సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో ఎవ్వరనీ వదిలిపెట్టం. దీనిపై విచారణ జరుగుతోంది. రైతుల ముసుగులో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయి. లగచర్ల ఘటనలో కేటీఆర్ ఉన్నట్టు వారి పార్టీ నాయకులే అంటున్నారు. కేటీఆర్ పదే పదే అరెస్ట్ అనడం కేవలం సానుభూతి కోసమే. ఆయనను అరెస్ట్ చేయడానికి మేమేమీ కుట్రలు చేయడం లేదు. సీనియర్ అధికారి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి అయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయి.గత పదేళ్లలో రైతులకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోంది. సన్న వడ్లు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం సేకరించిన వారం రోజులలోపే ఐదు వందల బోనస్ రైతులకు అందుతాయి. రైతుల విషయంలో ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారం ఆపాలి. ఇప్పటి వరకు 33కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రాసెస్ జరిగింది. 66 లక్షల ఎకరాల్లో 140 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది.కాళేశ్వరంతోనే నీళ్లు ఇచ్చాం అన్నారు.. మరి ఈ ధాన్యం ఉత్పత్తి కాళేశ్వరంతో కాలేదు కదా?. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేశారు. బీజేపీ తమ బాధ్యతలను విస్మరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించాలి. గత ప్రభుత్వ హయంలో గుట్టలకు, పుట్టలకు, చెట్లకు రైతుబంధు ఇచ్చారు. ఇలాంటి విధానాన్ని మేము కొనసాగించం.. నిజమైన రైతులకు న్యాయం చేస్తాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే మీ పదవి పోతుంది రేవంత్ : కేటీఆర్
సాక్షి,సంగారెడ్డి: లగచర్లలో జరిగిన దానికి మసిపూసి మారేడు కాయ చేశారని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల కేసులో అరెస్ట్ అయ్యి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా తన చేతకాని తనాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రదర్శిస్తున్నారు. కేసులు పెడతామని ఎవరు బెదిరించినా భయపడొద్దు. కేసులు పెట్టడానికి మించి ఏం చేయలేరు. లగచర్లలో దాడి అనంతరం పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల్ని వదిలేశారు. బీఆర్ఎస్ శ్రేణుల్ని అరెస్ట్ చేశారు. థర్డ్ డిగ్రీలు పెట్టి చిత్రహింసలు ఔట్టారు. మేజిస్ట్రేట్ ముందు ఈ విషయం చెబితే ఇంట్లో వాళ్ళని కొడుతామని బెదిరించారు. కొడంగల్ ఎస్సై, సీఐ వందల మంది పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు అసభ్య పదజాలంతో మాట్లాడుతూ దాడి చేశారు. సీఎం రేవంత్ పదవి ఐదేళ్లే. మీ ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది. మేం అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో మాకు తెలుసు. జైల్లో వేసిన కుటుంబాల ఉసురు తగులుతుంది. బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుంది.తిరుపతి రెడ్డి బెదిరింపులకు ఎవరు భయపడరు.అవసరం అయితే సుప్రీం కోర్టుకి వెళతాం. పిల్లలు కలెక్టర్‌ని కొట్టారు అని కేసులు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న ఆందోళనలకు మా పార్టీ అండగా ఉంటుంది’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. -
పనిమంతుడు పందిరేస్తే.. కుక్క తోక తగిలి కూలిపోయిందట: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. అలాగే, 11 నెలల పాలనలో సంక్షేమం మాయమైంది.. అభివృద్ధి దూరమైందని చెప్పారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..పనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందటసంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారుకానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారు36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారువందలాది గురుకుల పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారుపత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డికి పావుశేరు కింద తమ ఆరుగాలం కష్టాన్ని అమ్ముకుంటున్నారుహైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి కునుకు లేకుండా చేశారుఫార్మాసిటీకి సేకరించిన భూమిని పక్కన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారుమా భూములు మాకేనని ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారు11 నెలల పాలనలో సంక్షేమం మాయమయింది అభివృద్ధి దూరమయిందికాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతుందికాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తుందిపనిమంతుడు పందిరేస్తే-కుక్క తోక తగిలి కూలిపోయిందటసంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే గానీ 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించారుకానీ వేదికల మీద మాత్రం నాణ్యత లేకుంటే జైలుకే అని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు11 నెలల పాలనలో… pic.twitter.com/p4dy75dFL6— KTR (@KTRBRS) November 15, 2024 -
పట్నం కోసం రంగంలోకి బీఆర్ఎస్ లీగల్ టీమ్.. పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటన కేసులో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ కోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు రిమాండ్ విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని ఆయన కోరారు. నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పట్నం నరేందర్ రెడ్డి. అయితే, ఈరోజు హైకోర్టుకు సెలవు కావటంతో సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.మరోవైపు.. నరేందర్ రెడ్డిని స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోరుతూ బీఆర్ఎస్ లీగల్ టీమ్ నేడు హౌజ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు. నరేందర్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. జైలులో ఐదుగురు నేరస్థులతో కలిపి మాజీ ఎమ్మెల్యేను ఉంచారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ చెబుతోంది. ఈ క్రమంలోనే ఆయనను స్పెషల్ బ్యారక్‌లో ఉంచాలని కోర్టును కోరనుంది. ఇదిలా ఉండగా.. లగచర్ల ఘటనలో మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్యంగా ఓ ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. మరో కొంత మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో అమాయక రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయతి్నస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తించాలని, పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టొద్దని గురువారం ఒక ప్రకటనలో ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని విమర్శించారు.కలెక్టర్‌పైనే హత్యకు భారీగా కుట్ర పన్నారని, రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనివెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, స్థానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కుట్రపూరిత చర్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. రైతులకు నష్టం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. అధికారులపై దాడి జరిగినట్టుగానే భవిష్యత్‌లో రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.ప్రజలను కాపాడుకున్నట్టే, అధికారులను కాపాడుకోలేకపోతే పనిచేయడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేశారని గుర్తు చేశారు. ఇసుక దందాలకు అడ్డువస్తున్నారని, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని నేరెళ్లలో దళితులను ట్రాక్టర్‌తో తొక్కించి పోలీస్‌స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక 2021 జూన్ నెలలో వేములఘాట్ రైతు తూటుకూరి మల్లారెడ్డి, కూలి్చవేసిన తన ఇంటిలోని కట్టెలను పోగుచేసి, దానినే చితిగా మార్చుకొని ఆత్మార్పణ చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన బాధలను భరించలేక ఏకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. గడచిన 11 నెలలుగా ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్రకు పొంగులేటిమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గురువారం నాందేడ్ ప్రాంతంలో జరిగిన పలు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు వచి్చన రాహుల్‌గాం«దీకి నాందేడ్ విమానాశ్రయంలో మంత్రి ఉత్తమ్‌తో కలిసి స్వాగతం పలికారు. -
నాపై కేసు రాజకీయ ప్రేరేపితం: పట్నం
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన ప్రమేయం లేదని, రాజకీయ ప్రేరేపణతో తనపై కేసు నమోదు చేశారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురు వారం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆధారాలు లేకుండా తనపై నమోదు చేసిన కేసును, వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టు ఇచ్చిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ‘బొమ్రాస్పేట్ స్టేషన్లో నమోదైన కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే నన్ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు కనీసం కారణాలను వెల్లడించలేదు. న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పోలీసులు తూతూ మంత్రంగా దాఖలు చేసిన రిమాండ్ డైరీని ట్రయల్ కోర్టు ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. టీఐఐసీ కోసం భూమి కోల్పోయే బాధితులే అధికారులపై దాడి చేశారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా, దురుద్దేశంతో, రాజకీయ కారణాలతో నమోదు చేసిన కేసులో విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలి..’అని నరేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ఈనెల 18న విచారణకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కట్టుకథ అల్లారు కలెక్టర్, జిల్లా అధికారులపై దాడి ఘటనలో తన పాత్ర ఉందంటూ పోలీసులు కట్టు కథ అల్లారని నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆదేశాలతో రైతులను దాడులకు పురికొల్పినట్లుగా తాను నేరాంగీకార ప్రకటన ఇచ్చానని పోలీసులు చెబుతున్నట్లు తెలిసిందన్నారు. చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్‌రెడ్డి.. ఈ మేరకు గురువారం తన న్యాయవాదుల ద్వారా కొడంగల్ కోర్టును ఉద్దేశించి అఫిడవిట్ పంపించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న తనను పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బలవంతంగా వికారాబాద్ పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలిపారు. ఆ తర్వాత పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకుని కోర్టుకు తీసుకెళ్లారన్నారు. కోర్టులో ప్రవేశ పెట్టిన తర్వాత లగచర్ల ఘటనలో తాను ప్రథమ ముద్దాయిగా ఉన్నట్లు సమాచారం ఇచ్చినట్లు వివరించారు. తన అరెస్టు విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు సమాచారాన్ని కనీసం తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఇవ్వలేదని తెలిపారు. తాను అఫిడవిట్లో పేర్కొన్న వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని సరైన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. బెయిల్ కోసం జిల్లా కోర్టులో పిటిషన్ అనంతగిరి: లగచర్ల ఘటనలో అరెస్టు అయిన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నరేందర్‌రెడ్డి గురువారం వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నరేందర్‌రెడ్డి తరఫున బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 18న విచారణ జరుగుతుందని న్యాయవాది శుభప్రద్ పటేల్ తెలిపారు. -
రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడం అవివేకం’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్– 2024లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఒకరిపైఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన ప్రజలతో మాట్లాడాలి.. అంతే తప్ప ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందులో సందేహం అక్కర్లేదని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలం: సముద్రాల్లో ఉన్న మినలర్స్ను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్‌షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి సారించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని, రెండుమూడు నెలల్లో ఈ బ్లాకులను వేలం వేస్తామని చెప్పారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్నామని, అక్కడ తవ్వకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. భారతదేశం బొ గ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఆధునిక సాంకేతికత వినియోగం, కా రి్మకుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచర ణ తదితర అంశాలను భారత్‌మండపంలో ప్రారంభించిన పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని వివరించారు. ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నా రు. సంవత్సరంపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
కేసీఆర్ మౌనం.. గోడకు వేలాడదీసిన తుపాకీ: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు మౌనం కూడా కాంగ్రెస్, బీజేపీలను భయపెడుతోందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. కేసీఆర్ నిశ్శబ్దం గోడకు వేలాడదీసిన తుపాకీ లాంటిదని.. ఆయన సరైన సమయంలో బయటికి వస్తారని చెప్పారు. రేవంత్ ఒక అజ్ఞాని, కేసీఆర్ ఒక లెజెండ్ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు ఉంటుందని.. అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో కేసీఆర్ పేరును రేవంత్ ప్రతిరోజూ ప్రస్తావిస్తూనే ఉన్నారని చెప్పారు. మరో నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో కేటీఆర్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలివీ..సాక్షి:లగచర్ల ఘటనలో మీ పాత్ర ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఏమంటారు?కేటీఆర్: లగచర్ల ఘటనలో ఎలాంటి కుట్ర లేదు. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తలో మాట చెప్తున్నారు. రేవంత్ సొంత అల్లుడి ఫార్మా కంపెనీ కోసం జరుగుతున్న భూసేకరణపై రైతులు అభ్యంతరం చెప్తున్నారు. 9 నెలలుగా సీఎం, మంత్రులు, అధికారులు ఎవరూ వారితో మాట్లాడలేదు. కొందరిని దోషులుగా చూపిస్తూ గిరిజనుల భూములను లాక్కునేందుకు రేవంత్ చేస్తున్న కుట్ర ఇది. లగచర్ల ఘటనను రాజకీయ ప్రేరేపితమైనదిగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ప్రభుత్వ వ్యతిరేకత పెంచడమే మీ ఉద్దేశమనే ఆరోపణలపై మీ స్పందన?కేటీఆర్: కేవలం 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, నిరసన వెల్లువెత్తుతోంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అల్లాటప్పా నాయకుడు కాదు. గతంలో రేవంత్‌ను ఓడించారు. మరోవైపు రైతులను తన్ని అయినా సరే భూములు తీసుకుంటామని రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి చెప్తున్నారు. సీఎం సోదరుడు అయితే మాత్రం పేదల భూములు లాక్కుంటారా? ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? రేవంత్‌కు పాలనా అనుభవం లేక మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రిమాండ్ రిపోర్టులో మీ పేరు చేర్చడంపై ఏమంటారు? కేటీఆర్: పోలీసులు రేవంత్ ప్రైవేటు ఆర్మీలా తయారై... రిమాండు రిపోర్టులో ఏది పడితే అది రాస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నాకు.. పార్టీ నాయకుడు నరేందర్‌రెడ్డి ఫోన్ చేస్తే తప్పేముంది? లగచర్ల కార్యకర్త సురేశ్.. మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేయకూడదా? మా సంభాషణను డీప్‌ఫేక్ టెక్నాలజీతో సృష్టించి వక్రీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డిపై కూడా కేసులు పెట్టాలి. తిరుపతిరెడ్డి డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారు. పరిగి జైలుకు పంపిన లగచర్ల పేదలను విడుదల చేయాలి. పేదలు, గిరిజనుల కోసం ఒక్కసారి కాదు.. వందసార్లు జైలుకు వెళ్లేందుకైనా నేను సిద్ధం. ‘మిమ్మల్ని అడ్డుపెట్టి కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా..’అన్న సీఎం వ్యాఖ్యలపై మీ స్పందనేంటి? కేటీఆర్: కేసీఆర్‌ను ఫినిష్ చేస్తామని గత 24 ఏండ్లలో అన్నవారందరూ అడ్రస్ లేకుండా పోయారు. కేసీఆర్‌పై మాట్లాడే ముందు రేవంత్ తన స్థాయి, వయసు, గౌరవం ఏమిటో తెలుసుకోవాలి. కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ దుర్భాషలాడినంత కాలం మేం కూడా అదే తరహాలో సమాధానం ఇస్తాం. కాంగ్రెస్ స్కామ్స్, స్కీమ్స్ గురించి నిలదీస్తూనే ఉంటాం. ‘ఈ–ఫార్ములా’ఆరోపణల సంగతేమిటి? కేటీఆర్: ఎలక్ట్రిక్ వాహన రంగానికి రాష్ట్రాన్ని హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ–ఫార్ములా రేస్ నిర్వహించాం. అందులో ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ అంశంలో తీసుకున్న నిర్ణయాలకు నాదే బాధ్యత. కాంగ్రెస్ తెలంగాణకు ఏటీఎంగా మారిందని ప్రధాని మోదీ ఆరోపిస్తారు. కానీ బీజేపీ ఎంపీలు రేవంత్‌కు రక్షణ కవచంలా పనిచేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యారనేందుకు అనేందుకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. అమృత్ స్కామ్‌లో వివరాలు ఇచ్చినా కేంద్రం నుంచి స్పందన లేదు. మూసీ పునరుద్ధరణ పేరిట డీపీఆర్ లేకుండా ఇళ్లు కూల్చుతున్నా బీజేపీ నుంచి స్పందన లేదు. మిమ్మల్ని అరెస్టు వార్తలపై ఏమంటారు? కేటీఆర్: సీఎం రేవంత్ ఒక శాడిస్ట్. పోలీసులు ప్రైవేటు ఆర్మీలా ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. చరిత్రలో నియంతలకు పట్టిన గతే రేవంత్‌కు పట్టడం ఖాయం. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయి. -
కులగణనతో ఏ ఇబ్బంది ఉండదు, ఎవరి రిజర్వేషన్లు తొలగించం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో విద్యాశాఖకు అత్యధిక నిధులు కేటాయించామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామన్న సీఎం.. అన్ని వర్సీటీలకు వీసీలను నియమించామని చెప్పారు. రూ. 650 కోట్లతో పాఠశాలలను బాగు చేస్తున్నామని, పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో గురువారం బాలల దినోత్సవం సందరర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్ధులే బాగస్వాములు. కలుషితమైన ఆహారం వల్ల విద్యార్ధులు అస్వస్థతకు గురవుతున్నారు. కలుషితమైన ఆహారం పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. నాసిరకం భోజనం పెట్టిన వారితో ఊచలు లెక్కపెట్టిస్తాం. నాణ్యమైన బోజనాన్ని విద్యార్థులకు అందించాలి. సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం. మసాయిపేటలో రైలు ఢీకొన్న ఘటనలో 30 మంది పిల్లలు చనిపోతే కనీసం పరామర్శించలేదు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి. గత ప్రభుత్వంలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గత పదేళ్లలో 5 వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయి. పాఠశాలల మూసివేతతో విద్యకు పేదలు దూరమయ్యారు.చదవండి: అసెంబ్లీకి పోటీ.. అభ్యర్థుల వయోపరిమితి తగ్గించాలి: సీఎం రేవంత్ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే కుల గణన జరగాలి. కేంద్రం మెడలు వంచి కుల గణన జరిపి రిజర్వేషన్తు తీసుకొస్తాం. కుల గణనతో ఎవరి రిజర్వేషన్లు తొలగించం. కులగణనతో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పథకాలు తీసేయడానికి సర్వే చేయడం లేదు. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పెంచడం కోసమే. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే కులగణన జరగాలికొందరు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాను. కులగణను అడ్డువచ్చే ద్రోహులను సమాజంలోకి రానివ్వొద్దు. పదేళ్ల తర్వాత ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. సర్టిఫికెట్లు ఉంటే ఉద్యోగాలు రావు.. స్కిల్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. చదువులోనే కాదు.. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలి.’ అని సీఎం రేవంత్ తెలిపారు. -
‘నన్ను అరెస్ట్ చేస్తారా.. చేస్కోండి’: కేటీఆర్
సాక్షి,తెలంగాణ భవన్: నేను ఏ తప్పు చేయలే .. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం రాష్ట్ర రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చిట్‌చాట్‌లో కేటీఆర్ ఏమన్నారంటే..ఎస్పీ నారాయణ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్ని వదిలేసి బీఆర్ఎస్ శ్రేణుల్ని కొట్టారు. దీనిపై మేధావులు ఎవరు మాట్లాడలేదు. పోలీసుల తీరు సరిగా లేదు. పోలీసులు వైఫల్యం ఉంది. ఇంటిజెన్స్ వ్యవస్థ అట్టర్ ప్లాప్ అయింది. రేవంత్‌రెడ్డి సైన్యంలా పరిస్థితి తయారైంది. రైతులు,బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్లు చేస్తున్నారు. నేను ఊరుకోను. రేవంత్ రెడ్డి నీ సంగతి తేలు. లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తా. నేను ఏ తప్పు చేయలే.. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో. మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశా. నీ కుర్చీ కాపాడుకో. ఎన్ని రోజులు ఉంటావో. ఉత్తమ్, భట్టీ నీ కుర్చిలో కూర్చుంటారు. బాంబులు పేల్చేది నీ మీదనే.. మీ పార్టీలోనే. మూసీ కోసం రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. డబ్బు దండుకోవడమే. డీపీఆర్ లేకుండా రూ. లక్ష 50వేల కోట్లు ఎలా అవుతాయ్ రేవంత్. ఢిల్లీకి డబ్భులు పంపాలని ప్లాన్ చేశారు. నీ నియోజకవర్గంలో సమస్యనే పరిష్కరించలేని నువ్వు ఓ ముఖ్యమంత్రివి. నీదో కథ’ అని కేటీఆర్ చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. -
కేటీఆర్ పేరు చెప్పలేదు.. చర్లపల్లి జైలు నుంచి పట్నం లేఖ
సాక్షి, హైదరాబాద్: తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అంటూ చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్‌రెడ్డి లేఖ రాశారు. లగచర్ల దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌పై ఆయన స్పందిస్తూ.. కేటీఆర్ గురించి పోలీసులకు నేనేమీ చెప్పలేదు. పోలీసులు నా గురించి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు. చెప్పనిది చెప్పినట్లు రాశారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు.నిన్న రిమాండ్ రిపోర్ట్‌లో కేటీఆర్ పేరు చేర్చిన పోలీసులు.. దాడి వెనుక కేటీఆర్ ఉన్నట్లు నరేందర్‌రెడ్డి అంగీకరించాడంటూ రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. కాగా, బెయిల్ కోరుతూ వికారాబాద్ కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, నరేందర్‌రెడ్డిని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఏడు రోజులు కస్టడీకి ఇవాలని పోలీసులు కోరారు.ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటనలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ కేసులో మొదటి నిందితుడిగా చేర్చారు. హైదరాబాద్‌లో నాటకీయంగా అరెస్టు చేసిన నరేందర్‌రెడ్డిని కోర్టులో హాజరుపరచడం, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడం, పోలీసులు ఆయన్ను జైలుకు తరలించడం చకచకా జరిగిపోయాయి.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు పేరును నరేందర్‌రెడ్డి ప్రస్తావించారంటూ రిమాండ్ రిపోర్టులో పేర్కొనడంలో కలకలం రేపింది. నరేందర్‌రెడ్డిని కేటీఆర్ స్వయంగా ప్రోత్సహించినట్లుగా దర్యాప్తులో వెల్లడైందని... ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర జరిగిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. లగచర్లలో దాడి చేసినట్లుగా గుర్తించిన 46 మందిలో 19 మందికి భూములు లేవని తేలిందని ఐజీ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: ‘సెగ’చర్ల.. నరేందర్‌రెడ్డి అరెస్టు.. టార్గెట్ కేటీఆర్? -
కేటీఆర్ అలా మాట్లాడటం సిగ్గుచేటు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి,సంగారెడ్డి జిల్లా: ప్రజా ఆశీర్వాదంతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జహీరాబాద్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్లు పాలించి రాష్ట్రంలో వందేళ్ళ ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అభివృద్ధిని విస్మరించి స్నో, పౌడర్ ఖర్చులకు 50 వేల కోట్లు అప్పులు చేశారు. అధికారం పోయిన రెండో రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని దుష్ప్రచారం మొదలు పెట్టారు. మాజీలమని మరిచి కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు. లగచర్ల ప్రజాభిప్రాయ సేకరణ రణరంగం వెనక బీఆర్ఎస్ శ్రేణులు కుట్ర ఉంది. కలెక్టర్‌పై దాడి చేసిన సురేష్ తన మనిషేనని కేటీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజా ఆశీర్వాదంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు.పైసా పైసాకు కూడబెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. జహీరాబాద్‌లో అధునాతన మోడల్ ప్రభుత్వ అతిథి గృహం నిర్మిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న అన్ని రహదారులకు మరమ్మత్తులు పూర్తి చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. -
మా తడాకా చూపిస్తాం.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: కలెక్టర్‌ను చంపాలని బీఆర్ఎస్ కుట్ర చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కలెక్టర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ఆయనన కాపాడారన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పథకం ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగిందన్నారు. పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజలపై బీఆర్ఎస్ దాడులు చేసిందన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి బీఆర్ఎస్ కార్యకర్తలతో అధికారులపై దాడులు చేస్తున్నారు. దాడులకు ప్రతి దాడులు ఉంటాయి. అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ నేతలకు మా తడాకా ఏంటో చూపిస్తాం’’ అంటూ హెచ్చరించారు.మరోవైపు, బీఆర్ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏ కేసులోనైనా అరెస్ట్ కావొచ్చు.. పోరాటాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్ -
ఏ కేసులోనైనా అరెస్ట్ కావొచ్చు.. పోరాటాలకు సిద్ధమవ్వండి: కేటీఆర్
సాక్షి, తెలంగాణభవన్: తనను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ నేపథ్యంలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో నేడు పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. లగచర్ల ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండటంతో దీనిపై పార్టీ నేతలు చర్చించారు. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసింది. నన్ను అరెస్ట్ చేసేందుకు పలు డ్రామాలకు తెరలేపుతున్నారు. ఏదో ఒక కేసులో నన్ను అరెస్ట్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. పోరాటాలు మనకేమీ కొత్త కాదు అని నేతలకు సూచించారు.మరోవైపు.. లగచర్ల కేసులో అరెస్టయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని హరీశ్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడుతూ.. కుట్రపూరితంగా నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. కొడంగల్ నుంచే ప్రజాపాలన మీద తిరుగుబాటు మొదలైంది. ఈ అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి ఇదే నిదర్శనం. మీకు ఓటేస్తే మేలు జరుగుతుందనుకుంటే పాపానికి.. లగచర్ల గ్రామం భూములను గుంజుకోవడమే నువ్వు చేసే మేలా?. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు వల్లే వేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా బీఆర్ఎస్పై పెడుతున్నారన్నారు. రేవంత్ సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజనులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్ఎస్ చేసిందనే అంటున్నారన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా మా బాధ్యత అన్నారు. మాపై కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి.. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులెలా పెడతారని ప్రశ్నించారు. వెంటనే గిరిజన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అని మండిపడ్డారు.