నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయాలే జిల్లా కార్యాలయాలు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సాగునీటి శాఖలోని మధ్య, చిన్న తరహా విభాగాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు(ఎస్‌ఈ) జిల్లా ఇన్‌చార్జీలుగా ఉండగా, ఇప్పుడు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల(ఈఈ)ను కొత్త జిల్లాల్లో జిల్లా నీటి పారుదల శాఖ అధికారి(డీఐవో)లుగా వ్యవహరించనున్నారు. దీనిపై ఇప్పటికే నీటిపారుదల శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కేంద్రాల్లోని నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయాలు ఇకపై జిల్లా కార్యాలయాలుగా మారుతాయి.
రాష్ట్రంలో ఇప్పటికే 33 భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించారు. మరోపక్క రూ. రెండువేల కోట్లతో 9 వేల చెరువుల పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయి. చెరువు పనుల గుర్తింపు, అంచనాల తయారీ, క్షేత్రస్థాయి పరిశీలన, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు, పనుల విలువ మదింపు తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ట్రాంలోని కీలక పోస్టుల భర్తీని పూర్తిచేశారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ మొదలు సీఈ, ఎస్‌ఈ, డీఈ, ఈఈ, ఏఈఈ, ఏఈలు కలిపి మొత్తంగా 2,440 పోస్టులుండగా ఇప్పటికే 2 వేల పోస్టుల్లో అధికారులు పనిచేస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే ఇక డీఐవోలు!
Published Mon, Oct 10 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement
Advertisement