district offices
-
11 రాష్ట్రాల సీఎంలు షాక్ అయ్యారు: కేసీఆర్
-
జనగామలో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం
-
సమీకృత ‘జిల్లా కార్యాలయాలు’
• ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలి: కేసీఆర్ • వీలైనంత త్వరగా డిజైన్లు ఖరారు చేయాలి • వచ్చే బడ్జెట్లో నిధులు, ఏడాదిలోపు నిర్మాణం • సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డిలకు మినహాయింపు సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లా కేంద్రంలోనూ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలు, జిల్లా పోలీసు కార్యాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘‘సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లను కొత్తగా నిర్మించినందున వాటి స్థానంలో నూతన కార్యాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు. మిగతా 28 జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించాలి. 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రజలకు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా సకల వసతులతో నిర్మించండి. తక్షణం డిజైన్లు ఖరారు చేసి టెండర్లు పిలవండి’’ అని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీటికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాల నిర్మాణాలపై గురువారం ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష జరిపారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు సునీల్ శర్మ, రామకృష్ణారావు, శాంతకుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. పాలన సౌలభ్యం, ప్రజా సౌకర్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘పాలన కార్యకలాపాలు సమర్థంగా జరగాలంటే మెరుగైన కార్యాలయాలు కావాలి. జిల్లా కేంద్రంలో పోలీస్, అగ్నిమాపక కార్యాలయాలు మినహా మిగతావన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు నిర్మిం చాలి. పనులపై వచ్చే ప్రజలకు, అధికారులకు సౌకర్యంగా ఉండాలి. సమావేశాలు, రాష్ట్ర స్థాయి ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోగలిగేలా ఉండాలి. సీఎం, మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు సమీ క్షలకు, సమావేశాలకు కాన్ఫరెన్స్ హాలుం డాలి. ప్రతి గదికీ క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్‌స్కేపింగ్ చేయాలి. వాకింగ్ ట్రాక్స్, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అధికారులు, ఉద్యోగులు, ప్రజల కోసం టాయిలెట్లు, క్యాంటీన్లు, లంచ్ రూమ్‌లు, బ్యాంకు, ఏటీఎం, మీసేవా కేంద్రం, రికార్డు రూమ్, స్ట్రాంగ్ రూమ్, విద్యుత్ సబ్‌స్టేషన్, జనరేటర్, ఫైర్ స్టేషన్, యానిమల్ ట్రాప్స్ విధిగా ఉండాలి. వెయ్యి మంది పట్టే కాన్ఫరెన్స్ హాలు నిర్మించాలి. భావి అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి’ అన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. కార్యాలయ సముదాయాలకు స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయినందున వెంటనే లే ఔట్లు వేయాలన్నారు. ‘‘జిల్లా కేంద్రాల్లో పరేడ్ గ్రౌండ్స్‌తో కూడిన జిల్లా పోలీసు కార్యాలయాలు (డీపీఓ) నిర్మించండి. తమిళనాడులో డీపీఓలు బాగున్నాయం టున్నారు. డీజీ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం వెంటనే అక్కడికెళ్లి అధ్యయనం నివేదిక సమర్పించాలి’’ అని ఆదేశించారు. పోలీసులు నేర భాష మార్చుకోవాలి నేర సమావేశాల నిర్వహణకు జిల్లాల్లో కాన్ఫరెన్స్ హాలు నిర్మించాలని సీఎం సూచించారు. ‘‘పోలీసులు నేర భాష మార్చుకోవాలి. నెల నెలా నిర్వహించే సమీక్షలకు క్రైమ్ మీటింగ్ అన్న పేరునూ మార్చాలి. సానుకూల దృక్ప థంతో ఉండే పేరు పెట్టాలి’’ అన్నారు. మిషన్ భగీరథ పనులు గ్రామాల్లో బాగానే ఉన్నా పట్టణాల్లో మంద కొడిగా ఉన్నాయన్నారు. పనుల్లో వేగం పెంచాలని సీఎస్‌ను ఆదేశించారు. -
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లే ఇక డీఐవోలు!
నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయాలే జిల్లా కార్యాలయాలు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో సాగునీటి శాఖలోని మధ్య, చిన్న తరహా విభాగాల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు(ఎస్ఈ) జిల్లా ఇన్‌చార్జీలుగా ఉండగా, ఇప్పుడు నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల(ఈఈ)ను కొత్త జిల్లాల్లో జిల్లా నీటి పారుదల శాఖ అధికారి(డీఐవో)లుగా వ్యవహరించనున్నారు. దీనిపై ఇప్పటికే నీటిపారుదల శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లా కేంద్రాల్లోని నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయాలు ఇకపై జిల్లా కార్యాలయాలుగా మారుతాయి. రాష్ట్రంలో ఇప్పటికే 33 భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటికి ప్రస్తుత బడ్జెట్లో రూ.25 వేల కోట్లు కేటాయించారు. మరోపక్క రూ. రెండువేల కోట్లతో 9 వేల చెరువుల పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయి. చెరువు పనుల గుర్తింపు, అంచనాల తయారీ, క్షేత్రస్థాయి పరిశీలన, కాంట్రాక్టర్లతో ఒప్పందాలు, పనుల విలువ మదింపు తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే రాష్ట్రాంలోని కీలక పోస్టుల భర్తీని పూర్తిచేశారు. ఇంజనీర్ ఇన్ చీఫ్ మొదలు సీఈ, ఎస్ఈ, డీఈ, ఈఈ, ఏఈఈ, ఏఈలు కలిపి మొత్తంగా 2,440 పోస్టులుండగా ఇప్పటికే 2 వేల పోస్టుల్లో అధికారులు పనిచేస్తున్నారు. -
సూర్యాపేట హైవేలో ప్రభుత్వ కార్యాలయాలు
ఆలయ భూమి పరిశీలించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ : పట్టణ శివారు సూర్యాపేట హైవేలోని దేవాదాయ శాఖ భూమిలో జనగామ జిల్లా కార్యాలయాల నిర్మా ణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి తెలిపారు. ఆర్డీవో వెంకట్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన రహదారి పక్కనే దేశాదాయశాఖ పరిధిలో ఉన్న 25 ఎకరాల స్థలంలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట నిర్మించుకోవచ్చని తెలిపారు. దీని పక్కనే ఉన్న గార్లకుంటలో ఉన్న 15 ఎకరాలను పోలీసు పరేడ్ గ్రౌండ్ కోసం వినియోగించుకోవచ్చని చెప్పారు. దేవాదాయశాఖ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల కోసం పరిశీ లించాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను కోరుతామన్నారు. అలాగే, తాత్కాలికంగా ధర్మకంచలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహంలో కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రజల కోరిక మేరకు జనగామను జిల్లా చేసిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండ యాదగిరిరెడ్డి, డాక్టర్ సుగుణాకర్రా జు, కారింగుల రఘువీరారెడ్డి, పసుల ఏబేలు, కే.ఉపేందర్, ఆర్ఐ రాజు, వీ ఆర్వో రాజయ్య, రావెల రవి ఉన్నారు. జిల్లా కార్యాలయాలకు భవనాల పరిశీలన జనగామను జిల్లా చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సానుకూల ప్రకటన చేయగా అధికార యంత్రాంగం పరుగులు పెడుతోంది. దసరా పండగ రోజు నుంచే నూతన జిల్లా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డీఎస్పీ పద్మనాభరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాడిపల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భవనాలను పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ, ట్రెజరీ కార్యాలయాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. పురపాలకసంఘంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనంతోపాటు ఇంటిగ్రేటెడ్ బాలికల హాస్టల్, ప్రగతి ఫార్మసి, వ్యవసాయ మార్కెట్లోని కాటన్ యార్డు, దేవాదుల క్వార్టర్స్, ఇండోర్ స్టేడియం గదులు, ధర్మకంచలోని బాలికల వసతిగృహం, 9 కమ్యూనిటీ హాళ్లను పరిశీలించి, ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు గుర్తించిన నూతన భవనాలను చూసేందుకు బుధవారం జనగామకు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ రానున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఆర్ఐ రాజు, వీఆర్వో రాజయ్య, నాయకులు గజ్జెల నర్సిరెడ్డి, బొల్ శ్రీనివాస్, ఆకుల సతీష్ ఉన్నారు.