పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని గ్రామస్తులు తరగతి గ దిలో ఐదు గంటల పాటు నిర్బంధించారు. ఉపాధ్యాయుడు పాఠశాలకు సరిగా రా వడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఈ సంఘటన గురువారం మండలంలోని చౌడూరు ప్రాథమిక పాఠశాలలో జ రిగింది. ఈ పాఠశాలో 110 విద్యార్థులు చదువుతున్నారు.
విద్యార్థులకు అనుగుణంగా నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో ఓ మహిళా టీచర్, ఓ ఉపాధ్యాయుడు సెలవుపై వెళ్లారు. మరొకర్ని డీఈఓ డిప్యూటేషన్‌పై తీసుకున్నట్లు సమాచారం. దీంతో 110 మంది విద్యార్థులకు కేవలం హెచ్‌ఎం వెంక టేశ్వర్ రెడ్డి ఒక్కరే విద్యాబోధన చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. ఈ విషయంపై ఆగ్రహించిన గ్రామస్తులు గురువారం ఉద యం పాఠశాల ప్రారంభం కాగానే హెచ్‌ఎంను తరగతి గదిలో వేసి నిర్బం ధించా రు. పాఠశాలకు సంబంధించిన స్పష్టమైన హామీ వచ్చే వరకు విడిచేది లేదంటూ గది లో ఉంచి తాళం వేశారు.
ఈ విషయంపై ఎంఈఓ డీఈఓ, ఉన్నతాధికారులకు సమాచారం అందజేశా రు. సమస్యను పరిష్కరించే వరకు వినేది లేదంటూ గ్రామానికి చెందిన యువ త మొండికేశారు. దాంతో అధికార యం త్రాంగం తీవ్ర ఆందోళనకు గురయింది. ఈ విషయంపై డీఈఓతో ప లుమార్లు మండల అధికారులు చర్చిం చారు. ఎట్టకేలకు డీఈఓతో స్పష్టమైన హా మీ ఇచ్చారు. 15వ తేదీలోగా పాఠశాలకు సంబంధించిన మధు అనే ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్ రద్దు చేసి పాఠశాలకు పంపిస్తానని హామీ ఇచ్చారు.
ఐదు గంటల పాటు నిర్బంధించిన ఉపాధ్యాయుడిని విడుదల చేశారు. దీంతో సమస్య సద్దుమనిగింది. మండలంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే ప్ర థ మం. ఈ ఆందోళనలో గ్రామానికి చెం ది న యువజన సంఘాల నా యకులు ష బ్బీ ర్, గణేష్, రఘు, వెంకట్‌రులు పాల్గొన్నారు