మెదక్: మెదక్ జిల్లాలోని సంగారెడ్డి చౌరస్తాలో హిందూజ లీలాండ్ ప్రైవేట్ ఫైనాన్స్లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్లో ఫర్నిచర్ దగ్ధమైనట్టు తెలుస్తోంది. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.