మెదక్ : మెదక్ జిల్లాలో అతిపెద్ద శివాలయమైన కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయం భక్తుల రద్దీతో పోటెత్తింది. మంగళవారం అమవాస్య కావడంతో స్థానికులే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు అమృతగుండంలో పుణ్యస్నానాలు చేసి జలలింగానికి పూజలు చేశారు. కేతకీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.