ఆదిలాబాద్: ఒక మిస్డ్‌కాల్ ఆ యువకుడి ప్రాణాలను తీసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం జక్కెపల్లి గ్రామంలో జరిగింది.
వివరాలిలా ఉన్నాయి. అంబిలపు సనకస్‌నందన(25) ఇంటి దగ్గరలో ఉండే సమీప బంధువైన లావణ్య సెల్‌ఫోన్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చాడు. ఈ కాల్ ఆధారంగా ఆమె సనకస్‌నందనకు ఫోన్ చేయడంతో ఇద్దరి మధ్య మాటలు పెరిగి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ వ్యవహారం ఆమె భర్త రామకృష్ణకు తెలియడంతో యువకుడిని మందలించాడు. మాట్లాడిన అన్ని విషయాలు రికార్డు చేశానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు. దీంతో అవమానంగా భావించిన సనకస్‌నందన గ్రామ సమీపంలోని అడవిలో ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సనకస్‌నందన మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ప్రాణం తీసిన మిస్డ్‌కాల్
Published Sat, Jan 24 2015 2:27 PM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM
Advertisement
Advertisement