సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల పాలక మండలిలకు ప్రభుత్వం కొత్త డైరెక్టర్లను నియమించింది. టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి పదవీ కాలాన్ని 2019 మార్చి 31 వరకు పొడిగించడంతోపాటు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్కో) వైస్ చైర్మన్, ఎండీగా జానయ్యను నియమించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 12 కొత్త డైరెక్టర్ల నియామకంతోపాటు ఇప్పటికే పనిచేస్తున్న 9 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించింది. కొత్తగా నియమితులైన 12 మంది డైరెక్టర్లు 2019 మే 31 వరకు పదవుల్లో కొనసాగుతారని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్తగా నియమితులైన డైరెక్టర్లు..
టీఎస్‌ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లుగా రాములు (కమర్షియల్, డీపీఈ, అసెస్మెంట్, ఎనర్జీ ఆడిట్), పర్వతం(హెచ్‌ఆర్ అండ్ ఐఆర్), మదన్ మోహన్(పీఅండ్‌ఎంఎం),స్వామిరెడ్డి (ప్రాజెక్ట్స్) నియమితులయ్యారు. టీఎస్‌ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లుగా మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), సంధ్యారాణి(కమర్షియల్), గణపతి (ఐపీసీ అండ్ ఆర్‌ఏసీ), నర్సింగ్‌రావు (ఆపరేషన్స్), మహమ్మద్ యూనస్ (పీ అండ్ ఎంఎం)లను నియమించారు. ఎన్పీడీసీఎల్‌లో డైరెక్టర్(ఆపరేషన్స్)గా పనిచేస్తున్న బి.నర్సింగ్‌రావును ట్రాన్స్‌కో డైరెక్టర్ (గ్రిడ్ ఆపరేషన్స్)గా నియమించారు. జెన్‌కో డైరెక్టర్లుగా లక్ష్మయ్య(థర్మల్), అజయ్ (సివిల్) నియమితులయ్యారు. ఎన్‌ఎండీసీలో డైరెక్టర్ (కమర్షియల్)గా పనిచేస్తున్న టీఆర్‌కే రావు ను జెన్‌కోలో డైరెక్టర్ (ఇంధన నిర్వహణ)గా రెండేళ్ల పదవీ కాలంతో నియమించారు.
పదవీ కాలం పొడిగింపు..
టీఎస్‌ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు జె.శ్రీనివాస్, టి.శ్రీనివాస్ (ఐపీసీ, ఆర్‌ఏసీ), టీఎస్‌ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు (హెచ్‌ఆర్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి.నర్సింగ్‌రావు (ప్రాజెక్టులు), టి.జగత్‌రెడ్డి (ట్రాన్స్‌మిషన్), జె.సూర్యప్రకాశ్ (ఎత్తిపోతల), జెన్‌కో డైరెక్టర్లు సీహెచ్.వెంకటరాజం (హైడల్), ఎస్.అశోక్‌కుమార్ (హెచ్‌ఆర్), ఎస్.సచ్చిదానందం (ప్రాజెక్ట్స్)ల పదవీ కాలాన్ని 2019 మార్చి 31 వరకు పొడిగించింది.
విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లు
Published Sun, Sep 2 2018 3:09 AM | Last Updated on Sun, Sep 2 2018 3:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment