సెంచరీ దాటినా చలాకీగా.
రోజువారీ పనులు చేసుకుంటున్న అవ్వ
జగమంత కుటుంబానికి పెద్ద దిక్కు
మండలంలోని బంధనపల్లి శివారుతండాకు చెందిన భూక్యా కనకమ్మ అనే వృద్ధురాలు ప్రస్తుతం 110 ఏళ్లు వయస్సు ఉంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె భర్త భూక్యా తావుర్యా నడీడులోనే మరణించాడు. కాగా, కనకమ్మకు కుమారుడు జీవ్లా, ముగ్గురు కూతుర్లు (మంగతి, లచ్చమ్మ, ఈరమ్మ) ఉన్నా రు. అయితే కుమారుడు మరణించాక మనువ డు బీల్యాకు కనకమ్మే పెళ్లి చేసింది. అతడికి ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకుకు కూతురు, రెండో కుమారుడికి ఇద్దరు కుమారు లు, మూడో కొడుకుకు కూతురు ఉన్నారు. ఇదిలా ఉండగా, కనకమ్మ పెద్ద కూతురుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు.. రెండో కూతురుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు.. మూడో కూతురుకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
అలాగే వీరికీ కూడా సం తానం ఉన్నారు. మొత్తం అందరూ కలిపి ‘సెం చరీ’ దాటారు. అయితే ఇంత కుటుంబానికి పే...ద్ద మనిషి కనకమ్మే. ఇప్పుడు కూడా ఆమె అందరి బాగోగులూ చూస్తోంది. కాగా, వ య స్సు పెరిగిపోతున్నప్పటికీ ఆమె ఇప్పటివరకు ఎవరిపై ఆధారపడడం లేదు. గిన్నెలు తోముకోవడం, ఇళ్లూవాకిలి ఊడ్చుకోవడం ఇలా అన్ని పనులు సొంతంగానే చేసుకుంటోంది. అన్నట్టు.. ఇంకో విషయం.. కనకమ్మ నాటు వైద్యురాలు కూడా! సంతానం లేనివారికి ఆకుపసరు అందిస్తుంది. చిన్న పిల్లలు భయపడితే వారికి బూడిదతో బొట్టు పెడితే కుదుటపడతారని స్థానికుల విశ్వాసం. అలా కనకమ్మ జనంతోనూ మమేకమవుతోంది. ఆమె ఇంటి కెళ్లిన వారు ఆప్యాయం గా పలకరించి మంచీచెడ్డ మాట్లాడాకే వెనుదిరుగుతారు. కాగా, ఈ వయసులోనూ ఆమె మెనూ మాత్రం జొన్నరొట్టే! ఇంత వయస్సున్నా.. ఈమెకు అధికారులు ఆసరా పింఛన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆమె మునిమనుమడు ఎస్సై అయ్యూడనేది అధికారుల మాట.
ఇది యూంత్రిక జీవనం. మనిషికి లక్షాతొంభై రోగాలు. ఒత్తిళ్లు.. ఆహారపు అల వాట్లు.. కారణాలేమైనా కావచ్చు.. మనిషి ఆయుర్ధాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఆరు పదుల వయస్సుదాటి బతికితే ‘అబ్బో ముసలోడు గట్టోడే’ అంటుంటారు. అదే వందేళ్లూ జీవిస్తే ఆశ్చర్యమే..! మరి 110 ఏళ్లు బతికి ఉంటే.. అమితాశ్చర్యం కదా! బతికి ఉండడమే కాదు.. ఈ వయసులోనూ తన రోజువారీ పనులు చక్కగా చేసుకుంటుంటే చూసిన వారు నోరెళ్ల బెట్టాల్సి వస్తోంది. మరీ ఆ ‘సీనియర్’ సిటిజన్ గురించి తెలుకోవాలనుకుంటున్నారా.. అయితే పదండి..
- బంధనపల్లి(రాయపర్తి)
దేవతలా చూసుకుంటాం..
మా కనకమ్మను ఇ ప్పటికి మేము దేవత లా చూసుకుం టాం. ఆమెకు 110 యేళ్లకు పైగా ఉంటాయని మా బంధువులు చెబుతుంటారు. ఇప్పటికీ తనపని తానే చేసుకుంటుంది. ఆమెకే ఇబ్బంది రాకుండా కుటుంబ సభ్యుల మంతా జాగ్రత్తలు తీసుకుంటాం.
- దీప్లానాయక్, కనకమ్మ మునిమనవడు
కనకమ్మ @ 110
Published Sun, Mar 8 2015 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement