
150వ సినిమాలో ‘చిరు’ అవకాశం
జన్నారం: ‘నాకు చిరంజీవిని చూడాలని కోరిక ఉందని చెప్పాను. ఈ విషయం తెలుసుకున్న ఆయన స్వయంగా వచ్చి నాతో మాట్లాడారు. తన 150వ సినిమాలో నాకు అవకాశం ఇస్తానన్నారు. అందుకే నేను డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నా. జనవరి 1న ఫోన్ చేసి నాకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.’ అని కేన్సర్ బాధితుడు సంగెం బాలు (తక్షక్) ఆనందంగా చెప్పాడు.
గురువారం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా జన్నారం వచ్చిన ఆ బాలుడు ‘సాక్షి’తో మాట్లాడాడు. లక్ష్మణచాంద మండలానికి చెందిన సంగెం శ్రీధర్, పద్మల పెద్ద కుమారుడు బాలు క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.