
క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్: ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని చైతన్యపురి పరిధిలో ఉన్న స్నేహపురి కాలనీలో గల శ్రీసాయి అపార్ట్మెంట్స్‌లో క్రికెట్ ఆన్‌లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న ఇద్దరిని ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.11 లక్షల నగదు, రెండు ల్యాప్‌టాప్‌లు, 16 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.