266 కిలోల బంగారం మాయం
తిరువనంతపురం: శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమయినట్టు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిట్ నివేదికలో ఈ విషయం పేర్కొన్నారు.
ఆలయానికి చెందిన 893 కేజీల బంగారం వివిధ పనుల నిమిత్తం బయటకు ఇచ్చారని, ఇందులో 627 కిలోల బంగారం మాత్రమే తిరిగొచ్చిందని ఆయన తెలిపారు. మిగతా బంగారం ఏమైందన్నది నిగ్గుతేలాల్సివుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వినోద్ రాయ్ ఆడిట్ నిర్వహించారు. ఆలయ సంపద సహా ఆదాయ వ్యయాలపై మదింపు చేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.