Sree Padmanabhaswamy temple
-
పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు
తిరువనంతపురం వేదికగా ఆదివారం (జనవరి15) శ్రీలంకతో నామమాత్రపు మాడో వన్డేలో టీమిండియా తలపడనుంది. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. కనీసం ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే తిరువనంతపురంకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. ఈ క్రమంలో భారత ఆటగాళ్లు కొంతమంది శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. వారిలో సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. వీరందరూ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మూడో వన్డేకు తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్,, కేెెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ. శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువానిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్. చదవండి: SL vs IND: శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్‌కు నో ఛాన్స్! కిషన్, సూర్య ఎంట్రీ -
ఆ గదిపై సుప్రీం ఆదేశాలను పాటిస్తాం
తిరువనంతపురం: కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలోని ‘బీ’ గదిని తెరవడంపై సుప్రీంకోర్టు ఏం చెబితే అది చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. గదిని తెరవడంపై ట్రావెన్కోర్ రాజవంశస్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ వారితో భేటీ అయ్యారు. పవిత్రమైన, సంప్రదాయ ఆంక్షలున్న ఆ గదిని తెరవకూడదనే తాము అనుకుంటున్నామనీ, అయితే తెరవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశిస్తే అందుకు తాము కూడా ఒప్పుకుంటామని రాజవంశస్తులు చెప్పినట్లు సమాచారం. 2002లోనూ ఓ సారి ఆ గదిని తెరిచే ప్రయత్నం జరిగిందనీ, అప్పుడు ఆలయ ప్రధాన అర్చకుడు కొన్ని పూజలు నిర్వహించిన అనంతరం దానిని తెరవకూడదని చెప్పారని రాజకుటుంబీకులు వెల్లడించారు. -
266 కిలోల బంగారం మాయం
తిరువనంతపురం: శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమయినట్టు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిట్ నివేదికలో ఈ విషయం పేర్కొన్నారు. ఆలయానికి చెందిన 893 కేజీల బంగారం వివిధ పనుల నిమిత్తం బయటకు ఇచ్చారని, ఇందులో 627 కిలోల బంగారం మాత్రమే తిరిగొచ్చిందని ఆయన తెలిపారు. మిగతా బంగారం ఏమైందన్నది నిగ్గుతేలాల్సివుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వినోద్ రాయ్ ఆడిట్ నిర్వహించారు. ఆలయ సంపద సహా ఆదాయ వ్యయాలపై మదింపు చేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. -
‘పద్మనాభ ఆలయం’పై జాగ్రత్త
సుప్రీం కోర్టు న్యూఢిల్లీ: కేరళలోని ప్రఖ్యాత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ ముసురుకున్న వివాదాలు, అవకతవకలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘అక్కడ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. వాటిలో కొన్ని అత్యంత తీవ్రమైన అంశాలున్నాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సరిదిద్దండి’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎం. లోధా, జస్టిస్ ఎ.కె. పట్నాయక్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పద్మనాభ స్వామి ఆలయ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘన, ఆలయ సంపద వంటి అంశాలపై సీనియర్ అడ్వొకేట్ గోపాల సుబ్రమణియం ఈ నెల 15న సమర్పించిన నివేదికపై విచారణ ప్రారంభించిన ధర్మాసనం పైవిధంగా ఆదేశించింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీగా కోర్టుకు హాజరైన సుబ్రమణియం.. ఆలయంలో జరిగే రోజువారీ కార్యకలాపాల్లో ప్రస్తుత ధర్మకర్త, ఆయన కుటుంబ సభ్యుల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయానికి అడ్డుకట్ట పడేలా మార్గదర్శనం చేయాలని కోర్టును కోరారు. ఆలయానికి స్వతంత్ర యాజమాన్యాన్ని ఏర్పాటు చేయాలని అప్పుడే అధికారులు వారి కార్యకలాపాలను స్వతంత్రంగా చేయగలుగుతారని పేర్కొన్నారు. ఆలయ సంపదలున్న పెట్టెలకు వేసిన తాళాలు, సీళ్లు తొలిగిపోయిన స్థితిలో కనిపించాయని చెప్పారు. సుబ్రమణియం ఇచ్చిన నివేదికపై ట్రావెన్కోర్ రాజ కుటుంబం తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ అడ్వొకేట్ కె.కె. వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నివేదికలోని అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తులు నివేదికలోని అంశాలపై స్పందిం చేందుకు కేరళ ప్రభుత్వం సహా ట్రావెన్కోర్కు కూడా అవకాశం ఇస్తామని, సుబ్రమణియం వెల్లడిస్తున్న అంశాలను తక్షణమే వినాల్సిన అవసరం ఉంద న్నారు. ‘మా వరకూ ఇది అత్యంత తీవ్రమైన అం శం. మీ వాదనలూ వినేందుకు మేం సిద్ధం’ అంటూ విచారణను గురువారానికి వాయిదా వేశారు.