తిరువనంతపురం: కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయం నేలమాళిగలోని ‘బీ’ గదిని తెరవడంపై సుప్రీంకోర్టు ఏం చెబితే అది చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. గదిని తెరవడంపై ట్రావెన్‌కోర్ రాజవంశస్తుల అభిప్రాయం తెలుసుకునేందుకు కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ వారితో భేటీ అయ్యారు.
పవిత్రమైన, సంప్రదాయ ఆంక్షలున్న ఆ గదిని తెరవకూడదనే తాము అనుకుంటున్నామనీ, అయితే తెరవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశిస్తే అందుకు తాము కూడా ఒప్పుకుంటామని రాజవంశస్తులు చెప్పినట్లు సమాచారం. 2002లోనూ ఓ సారి ఆ గదిని తెరిచే ప్రయత్నం జరిగిందనీ, అప్పుడు ఆలయ ప్రధాన అర్చకుడు కొన్ని పూజలు నిర్వహించిన అనంతరం దానిని తెరవకూడదని చెప్పారని రాజకుటుంబీకులు వెల్లడించారు.
ఆ గదిపై సుప్రీం ఆదేశాలను పాటిస్తాం
Published Tue, Jul 11 2017 1:32 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement