రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి | 54 infant deaths at Cuttack hospital in 2 weeks | Sakshi
Sakshi News home page

రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి

Published Tue, Sep 1 2015 9:26 AM | Last Updated on Sun, Sep 3 2017 8:33 AM

రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి

రెండు వారాల్లో 54 మంది శిశువులు మృతి

భువనేశ్వర్ : ఒడిశా కటక్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సర్దార్ వల్లభాయిపటేల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పిడియాట్రిక్స్ సంస్థలో నవజాత శిశువులు వరుసగా మరణిస్తున్నారు. గత 14 రోజుల్లో 54 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ సంఘటనతో నవీన్ పట్నాయిక్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అధ్యక్షతన ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అటాన్ సబ్యసాచి నాయక్ వెల్లడించారు. నవజాత శిశువుల మరణాలకు గల కారణంపై ఈ కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామన్నారు.

అయితే ఆసుపత్రిలో మృతి చెందిన శిశువులకు పోస్ట్ మార్టం నిర్వహించడం లేదని బీజేపీ ఆరోపించింది. శిశువు మృతికి నిరసనగా సెప్టెంబర్ 2 తేదీన రాష్ట్రంలో బంద్కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. మరో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా శిశువుల మరణాలపై స్పందించింది.  త్వరలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఆసుపత్రిని సందర్శిస్తారని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement