ఈ బ్యాటరీ చాలా హాట్ గురూ.. | A diamond battery made from nuclear waste could last more than 5,000 YEARS | Sakshi

ఈ బ్యాటరీ చాలా హాట్ గురూ..

Published Sat, Dec 3 2016 9:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ఈ బ్యాటరీ చాలా హాట్ గురూ..

ఈ బ్యాటరీ చాలా హాట్ గురూ..

న్యూక్లియర్  వేస్ట్ తో  ఒక వినూత్న  బ్యాటరీ ని  సైంటిస్టులు రూపొందించారు. 'డైమండ్ బ్యాటరీ' గా వ్యవహరిస్తున్న ఈ  బ్యాటరీ ఒకటి సుమారు 5 వేల ఏళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.  బ్రిటన్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టాల్స్‌ ఇంటర్‌ ఫేస్‌ ఎనాలసిస్‌ సెంటర్‌ కు చెందిన ప్రొఫెసర్‌ టామ్‌ స్కాట్‌ బృందం ఈ సరికొత్త బ్యాటరీని తయారు చేసింది. అత్యంత గట్టిదైన వజ్రంలోపల  రేడియోధార్మిక మూలం సురక్షితంగా పొదిగిన వుంటుందనీ, రేడియోధార్మిక మూలం పక్కన ఉంచినప్పుడు డైమండ్ ఛార్జ్ అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు  ఎలాంటి ఉద్గారాలను ఈ బ్యాటరీ రిలీజ్ చేయదని, మెయింటెన్స్ కూడా అవసరం లేదని కూడా  పరిశోధకులు చెప్తున్నారు. తాము సాధించిన ఈ పురోగతి అణు వ్యర్థాల సమస్య పరిష్కారానికి, శుభ్రమైన విద్యుత్ ఉత్పత్తికి , బ్యాటరీ లైఫ్ సమస్యలను పరిష్కరించటానికి సహాయ పడుతుందంటున్నారు
 
అణుధార్మిక వ్యర్థ పదార్థాలను ఉపయోగించి అత్యంత సుదీర్ఘకాలం పనిచేసే సామర్థ్యం కలిగిన ‘డైమండ్ బ్యాటరీ’ని రూపొందించారు. అంటే ఉదా:ఈ  బ్యాటరీని 2016లో తయారు చేస్తే అది నిరంతరాయంగా 7746 (సుమారు 5 వేల ఏళ్ల) వరకు పనిచేస్తుందని  ప్రొ. టామ్  చెబుతున్నారు. ఈ బ్యాటరీలను డ్రోన్లు, శాటిలైట్లు, అంతరిక్ష నౌకల్లో ఉపయోగించవచ్చని  తెలిపారు.  అణుధార్మిక వ్యర్థాలు, బ్యాటరీ జీవిత కాలానికి సంబంధించిన వివిధ సమస్యలకు ఇది చెక్ చెబుతుందంటున్నారు. రేడియేషన్‌ కోసం రేడియో యాక్టివ్‌ ఐసోటోప్‌ నికెల్-63ను ఉపయోగించి  ప్రోటో టైప్ డైమండ్  బ్యాటరీ నమూనా  తయారు చేసినట్టు టామ్ తెలిపారు. అయితే దీన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నామని ఆయన తెలిపారు. ఈ బ్యాటరీని తయారు చేసేందుకు కార్బన్-14ను పరిశోధకులు ఉపయోగిస్తున్నారని, ఇది కొంత మొత్తంలో రేడియేషన్‌ ను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.

అయితే ఇలా విడుదలయ్యే రేడియేషన్‌ ను ఇతర ఘనపదార్థాలు సులభంగా గ్రహిస్తాయని ఆయన చెప్పారు.  అత్యంత దృఢ పదార్థం వజ్రమని ఆయన గుర్తు చేసిన ఆయన  ఈ క‌ృత్రిమ వజ్రాన్ని రేడియో యాక్టివ్‌ పదార్థాలకు అతి సమీపంలో ఉంచినప్పుడు, ఆ రేడియో యాక్టివ్‌ పదార్థం ఆ వజ్రపు పొరల్లో నిక్షిప్తమవుతుందని ఆయన తెలిపారు. తద్వారా సురక్షితమయన, సుదీర్ఘకాలం పని చేసే సామర్థ్యం కలిగిన బ్యాటరీలను తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఈ బ్యాటరీలో విద్యుత్తు 5,730 ఏళ్లకు 50 శాతం, 11 వేల ఏళ్లకు 25 శాతం తగ్గుతుందని ఆయన తెలిపారు. మరోవైపు అత్యంత గట్టిపదార్థం  డైమండ్ కాదని,  డైమండ్ ను మించిన గట్టివ పదార్థాలు గ్రాఫేన్ , కార్బైన్ లన్నమరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కార్బన్-14 వినియోగం సామర్థ్యంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ  రెడిక్యులస్ అని కొట్టి  పారేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. సుమారు లక్షా 30 వేలకు పైగా వ్యూస్ ను  సొంతం చేసుకుంది.
 

 

Advertisement

పోల్

Photos

View all
Advertisement