బాలీవుడ్ నటిపై లైంగిక వేధింపులు, దోపిడీ | Bollywood actress molested, robbed in Delhi | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటిపై లైంగిక వేధింపులు, దోపిడీ

Published Sat, May 3 2014 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Bollywood actress molested, robbed in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ బాలీవుడ్ నటికి సైతం లైంగిక వేధింపులు తప్పలేదు. ఇద్దరు వ్యక్తులు నటిని లైంగికంగా వేధించడంతోపాటు నిలువు దోపిడీ చేశారు. ఈ కేసు వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు. బాధిత నటి శుక్రవారం రాత్రి ఆనంద్ నగర్‌లోని తన నివాసానికి వెళ్లేందుకు విశ్వాస్‌నగర్ ప్రాంతంలో ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో 20 సంవత్సరాల వయసుగల ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరకు వచ్చి బలప్రతాపం చూపారు. కొట్టడంతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ప్రతిఘటించడంతో ఆమెను నెట్టేసి ఐఫోన్, రూ. 5వేల నగదుతో ఉన్న పర్సుతో ఉడాయించారు.

 

గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొంటూ లైంగిక వేధింపులు, దోపిడీ ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించిందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement