చిట్టి @ 5 కిలోలు | born baby as 5kg's | Sakshi
Sakshi News home page

చిట్టి @ 5 కిలోలు

Published Fri, Nov 20 2015 3:16 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

చిట్టి @ 5 కిలోలు

చిట్టి @ 5 కిలోలు

అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా మూడు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఔరా అని ఆశ్చర్యపోతాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఓ మాతృమూర్తికి రెండో కాన్పుగా ఐదు కిలోల బరువు ఉన్న పాప పుట్టింది. కొత్తూరు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన యర్లంకి ప్రమీల ప్రసవ నొప్పులతో గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరగా.. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే సాయంత్రం 4 గంటల సమయంలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

ఈ విషయమై స్త్రీ వైద్య నిపుణురాలు ప్రసూన మాట్లాడుతూ తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోవటం, మంచి పౌష్టికాహారం కారణంగా ఐదు కిలోల బరువుతో బిడ్డ జన్మించినట్టు చెప్పారు.
     - పాలకొండ రూరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement