female child
-
ఆటల మాటల పాటల పుత్తడి బొమ్మరా... ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా!
ఒక మంచి మాట చల్లగా దీవిస్తూ అంటుంది ఇలా... ‘నీకు ఆడబిడ్డ పుట్టింది. ఇక అంతా అదృష్టమే’ ఇక పాట విషయానికి వస్తే తెలుగు పాట రకరకాల భావాలతో చిట్టితల్లికి పాదాభివందనం చేసింది. వాటిలో కొన్ని పాటల గురించి... గద్దర్ గొంతులో వినిపించే ‘నిండూ అమాసనాడు’ పాట ప్రతి పల్లెను, ప్రతి హృదయాన్ని తాకింది. ‘ఆడపిల్ల నాకొద్దు’ అనే మూర్ఖత్వాన్ని కన్నీటీతో కడిగిపారేసింది. ఎంతోమంది తండ్రుల్లో గొప్ప మార్పును తెచ్చిన పాటగా ‘నిండూ ఆమాసనాడు’ పాటను చెబుతారు. ఆ పాటను మరోసారి పాడుకుందాం... ‘నిండూ అమాసనాడు ఓ లచ్చగుమ్మడి /ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చగుమ్మడి అత్తా తొంగిచూడలేదో ఓ లచ్చగుమ్మడి/ మొగడు ముద్దాడరాలే ఓ లచ్చగుమ్మడి సెత్త గంపలేసుకొని ఓ లచ్చగుమ్మడి/ సెత్త కుండిలెయ్యబోతే ఓ లచ్చగుమ్మడి కుక్కపిల్ల అడ్డమొచ్చి ఓ లచ్చగుమ్మడి/ అక్కా అట్లా సెయ్యొద్దనే ఓ లచ్చగుమ్మడి బట్లలల్ల సుట్టుకోని ఓ లచ్చగుమ్మడి/ బాయిలో పడెయ్యబోతే ఓ లచ్చగుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఓ లచ్చగుమ్మడి/ సెల్లె దానమియమందో ఓ లచ్చగుమ్మడి పున్నామిదినము వోలే ఓ లచ్చగుమ్మడి/పుట్ట కాడ పడవేస్తే ఓ లచ్చగుమ్మడి నాగన్న గొడుగు పట్టిండమ్మో ఓ లచ్చగుమ్మడి....’ ఇక సినిమాల విషయానికి వస్తే...‘ఆకాశమంత’ సినిమాలో ఒక తండ్రి తన చిట్టిపాప గురించి ఇలా మురిపెంగా పాడుకుంటాడు... (రచన: అనంత్ శ్రీరామ్) ఆటల మాటల పాటల పుత్తడి బొమ్మరా /ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా మేఘాల పల్లకి తెచ్చిస్తా/ లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే కురిపిస్తా చల్లని హాయి అందిస్తా /పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తా లాలి పాటే నేనై లాలి పోసేవాడిని నేనవుతా ‘విశ్వాసం’ సినిమాలో అజిత్‌కుమార్ ఒక తండ్రిగా తన బంగారుతల్లి గురించి ఇలా పాడుకుంటాడు... (రచన: రామజోగయ్య శాస్త్రి) ‘చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా చిట్టి జాబిల్లి/నీ ఊసులోనే ముసురాడుతుంది ఈ నాన్న ఊపిరి’ ‘నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాలవాకిలి ఏ బూచి నీడ నీపై రాకుండా నేనేగా కావలి’ ‘కనుచివరన జారే తడి చినుకును సైతం/ సిరి తళుకుగా మార్చే చిత్రం నీదే’ చిరంజీవి ‘డాడీ’ సినిమాలో తండ్రి తన కను‘పాప’ గురించి ఇలా పాడుకుంటాడు...(రచన: సిరివెన్నెల) గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడీ/ డాడీ ఊపిరిలో మెరిసే కూచిపూడి చిందాడీ చిందాడీ తుళ్లిందంటే చిన్నారీ /మమ్మీ చూపుల్లో ఎంతో వేడి వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి/ ముదై్దన తినదే పరుగెత్తే పైడి లేడి చిలకల్లే చెవులో ఎన్నో ఊసులాడి/ పడుకోదే పన్నెండైన ఏంచేయాలి నీ నవ్వే చూసి నిలువెల్లా పొంగి పోని/కాసేపు ఉంటే చాలే ఈ నాన్న తోటి వెయ్యేళ్లు జీవిస్తానే ఆశతోటి. -
చిత్తూరు జిల్లాలో మెర్సీకిల్లింగ్ కేసు
-
కరుణ చూపండి..మరణం ప్రసాదించండి
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): ఇద్దరు మగ పిల్లలు.. ఒకరి తర్వాత ఒకరు గతంలో చనిపోయారు. మూడో సంతానంగా ఏడాది క్రితం ఆడ బిడ్డ పుట్టింది. అయితే పుట్టుక నుంచే శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం, మూర్చ పోవడం, శ్వాస తీసుకునేందుకు ఆ పాప ఇబ్బందులు పడుతోంది. ఆ చిన్నారి చికిత్సకుగాను శక్తికి మించి ఖర్చుచేశారు. పేదరికం కారణంగా ఇక ఖర్చు పెట్టే స్తోమత లేక, చిన్నారి పడుతున్న నరకయాతన చూడలేక ఆ తల్లిదండ్రులు గుండెల్లో బాధను దిగమింగుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చారు. గురువారం మదనపల్లె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ బిడ్డకు కారుణ్యమరణం ప్రసాదించాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట, బీసీ కాలనీలో నివాసం ఉండే బావాజాన్, షబానా దంపతులకు రెక్కాడితే గానీ డొక్కాడదు. సొంతిల్లు కూడా లేని వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మొదటి, రెండో సంతానంగా ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. పుట్టిన రోజుల వ్యవధిలోనే సుగర్ స్థాయి పడిపోయి ఆ ఇద్దరూ చనిపోయారు. మూడో సంతానంగా రెడ్డి సుహానా (1) జన్మించింది. పాపకు ఏడాది వయసు వచ్చినా ఎదుగుదల లేకపోవడంతో కొంతకాలం క్రితం డాక్టర్లకు చూపించారు. ఆ చిన్నారికి సుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో.. పాపను కాపాడుకోవడానికి అప్పులు చేసి వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాలేదు. ఇకపై వైద్యం చేయించడానికి వారివద్ద చిల్లిగవ్వలేదు. కళ్ల ముందే నరకయాతన పడుతున్న బిడ్డను చూస్తూ బతకలేమని, తమ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తల్లిదండ్రులు సెకండ్ జేయంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తాము ఇందుకు అనుమతించలేమని, జిల్లా జడ్జిని ఆశ్రయించాలని న్యాయమూర్తి సలహా ఇచ్చారని బాధితులు తెలిపారు. రోజుకు రూ. 2,400 ఖర్చు నా బిడ్డకు సుగర్ లెవల్స్ తగ్గడంతో ఆరోగ్యం క్షీణిస్తోంది. పాపకు రోజుకు 4 ఇంజక్షన్లు చేయించాలి. ఒక్కో సూది మందు రూ. 600. ఇలా రోజుకు రూ. 2,400 ఖర్చు చేయాలి. ఇప్పటికే ఉన్నవన్నీ అమ్మేశాం. మా వద్ద ఇంక మిగిలిందేమీ లేదు. ప్రభుత్వం ఆదుకుంటే బిడ్డను కాపాడుకుంటాం. న్యాయస్థానం అనుమతిస్తే బిడ్డ ప్రశాంతంగా అయినా కన్నుమూయాలని మేం కోరుకుంటున్నాం. – బావాజాన్, పాప తండ్రి, బి.కొత్తకోట, బీసీ కాలనీ ఆడబిడ్డ పుట్టిందనుకుంటే.. ఇద్దరు మగబిడ్డలు పుట్టి మాయదారి వ్యాధితో కళ్ల ఎదుటే మరణించారు. మూడో కాన్పులోనైనా ఆడబిడ్డ పుట్టిందనుకుంటే ఆ బిడ్డ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.పుట్టిన ప్రతి బిడ్డా మాకు దక్కకుండా పోతున్నారు. – షబాన, పాప తల్లి, బి.కొత్తకోట, బీసీ కాలనీ -
జీవితాంతం ఫుడ్ ఫ్రీ..
విమానంలో పాప పుట్టింది.. ఆ పాపకు జీవితాంతం మా విమానంలో ప్రయాణం ఫ్రీ.. ఇలాంటి వార్తలు అప్పుడప్పుడూ మనం ఎప్పుడో ఓసారి చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి సంఘటనే ఇటీవల అమెరికాలో జరిగింది. అదేంటంటే ఓ హోటల్లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫాలన్ గ్రిఫిన్ నిండు గర్భిణి. భర్తతో కలసి తన స్నేహితురాలి పిల్లలను ఇంటి వద్ద వదిలివచ్చేందుకు వెళుతున్నారు. టెక్సాస్‌లోని శాన్‌ఆంటోనియోలో ఉన్న ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ ముందుకు రాగానే ఆమెకు తీవ్రంగా నొప్పులు వచ్చాయి. విషయం తెలుసుకున్న ఆ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ స్టోర్ డైరెక్టర్ ఎన్రిక్ వచ్చి సాయం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఫాలన్. తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని ఎన్రిక్ చెప్పింది. ఆ పాపకు జీవితాంతం వారి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో ఫుడ్ ఫ్రీగా ఇస్తామని, ఆ పాపకు 14 ఏళ్లు రాగానే ఏదైనా ఉద్యోగం కూడా ఇస్తామని యాజమాన్యం సంతోషంగా ప్రకటించింది. -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం
వేంపల్లె : బస్సులో ప్రయాణిస్తున్న నిండు గర్భిణికి నెప్పులు రావడంతో బస్సులోనే పురుడు పోసేందుకు చర్యలు తీసుకుని ఆర్టీసీ బస్సు సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా వేంపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. క్రిస్మస్ పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లేందుకు గౌతమి అనే నిండు గర్భిణి పులివెందుల నుంచి తిరుపతి వెళుతున్న ఏపీ04జెడ్0131 నెంబర్ గల బస్సులో శనివారం ప్రయాణిస్తున్నది. ఈ క్రమంలో వేంపల్లె వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. గమనించిన బస్సు కండక్టర్ వేంపల్లె ప్రభుత్వాసుపత్రి సిబ్బందినకి ఫోన్ చేసి వారిని బస్సుకు వద్దకు పిలిపించారు. బస్సులోనే గర్భిణికి కాన్పు అయ్యేలా తగు చర్యలు తీసుకున్నారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆర్టీసీ సిబ్బంది తల్లీబిడ్డను వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బస్సులోని ప్రయాణికులు సిబ్బందిని అభినందించారు. -
పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డ..
నిడదవోలు : నవ మాసాలు మోసిన తల్లి అందమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అంతలోనే కసాయిగా మారింది. మాతృత్వం మంట కలిసిన వేళ... స్త్రీ తన హృదయాన్ని బండరాయిగా చేసుకుని అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పాడుబడ్డ ఇంట్లో ఎవరూ లేని సమయంలో వదిలి వెళ్లిన సన్నివేశం మానవత్వం ఉన్న మనుషులను కలచివేసింది. తల్లి గర్భం నుంచి అప్పుడే ప్రపంచాన్ని చూసిన ఆ బిడ్డ కేర్ కేర్ మని ఏడుస్తున్నా ఆ తల్లి మనసు కరగలేదు సరికదా రక్త సంబంధాన్ని కూడా నిర్ధాక్షిణ్యంగా తెంచుకుని వెళ్లిపోయింది. నిడదవోలు పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపం వెనుక భాగంలో ఉన్న పాడుబడ్డ పెంకుటింట్లో శనివారం ఉదయం గుర్తు తెలియని మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఇంట్లో గత కొంత కాలంగా ఎవరూ నివాసం ఉండటం లేదు. ఈ మహిళ ఎప్పుడు వచ్చిందో.. ఏం కష్టం వచ్చిందో తెలియదు. పురిటి నొప్పులను మౌనంగా భరిస్తూ ఎవరూ లేని సమయంలో గోనె సంచిపై అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సమాజం తనని వేలెత్తి ప్రశ్నిస్తుందని భయపడిందో లేక ఆడబిడ్డ ఎందుకని భావించిందో ఏమో తెలియదు కానీ బిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న బిడ్డను దోమలు, చీమలు కుట్టసాగాయి. దీంతో బిడ్డ బాధను భరించలేక కేర్ కేర్ మని ఏడవసాగింది. ఉదయం 9 గంటల సమయంలో పాడు బడ్డ ఇంట్లో నుంచి బిడ్డ ఏడుపు వినిపించడంతో సీతామహలక్ష్మి అనే మహిళతో పాటు స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బిడ్డ గోనె సంచిపై పడిఉంది. శిశువు పేగు కూడా తీయలేదు. మహిళలు ఈ బిడ్డను ఇంటికి తీసుకువెళ్ళి పేగు కోసి స్నానం చేయించారు. బిడ్డకు గాయాలు కావడంతో కొద్దిగా పౌడర్ అద్ది స్థానిక చిన్న పిల్లల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పట్ట ణ ఎస్సై జి.సతీష్ అక్కడ వచ్చి బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యాధికారి ఏవీఆర్ఎస్ తాతారావు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్య సేవలకు గాను 108 వాహనంలో ఏలూరు ఏరి యా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఐసీడీఎస్ అధికారులు ఏలూరు మతా శిశు సంరక్షణ కేంద్రానికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగా ఉందని, ఇన్ఫెక్షన్ కారణంగా శరీరంపై దద్దర్లు వచ్చాయని వైద్యులు పేర్కొన్నారు. పట్టణ ఎస్సై జి.సతీష్ 317 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెట్లపొదల్లో ఆడ శిశువు
హయత్‌నగర్‌లో దారుణం చోటుచే సుకుంది. సుమారు 3 నెలల వయసున్న ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్లపొదల్లో వదిలి వెళ్లారు. పాప ఏడుపు విని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి 108 వాహనాన్ని రప్పించి చిన్నారిని శిశువిహార్‌కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మండుటెండల్లో పసికందు
♦ రోడ్డుపక్కన వదిలివెళ్లిన వైనం ♦ హత్నూర మండలంలో ఘటన ♦ మంగాపూర్ శివారులో రోడ్డు పక్కన ఆడ శిశువు ♦ దౌల్తాబాద్ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స ♦ సంగారెడ్డి శిశువిహార్‌కు తరలింపు ♦ గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు హత్నూర: అభం శుభం తెలియని సుమారు నెలరోజుల ఆడ శిశువును మండుటెండలో రోడ్డు పక్కన చెట్టుకింద ఓ తల్లి వదిలేసి వెళ్లింది. ఈ సంఘటన మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్సై బాల్‌రెడ్డి, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మంగాపూర్ గ్రామ శివారులో సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కన ఓ చెట్టుకింద నెల రోజుల ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఎవరో వదిలేసి వెళ్లారు. నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వాల్దాస్ గోపాల్‌గౌడ్, అవంచ గ్రామానికి చెందిన రాజులు ఇద్దరు బైక్‌పై పెళ్లికి వెళ్లి తిరిగి నర్సాపూర్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపక్కన చెట్టు కింద చిన్న పరుపులో పాప ఏడుస్తూ కనిపించడంతో ఒక్కసారిగా ఇద్దరు యువకులు ఆగిపోయారు. ఈ వి షయమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై బాల్‌రెడ్డి, కానిస్టేబుల్ శర్మన్‌నాయక్‌లు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లారు. చెట్టుకింద రోదిస్తున్న పసిపాపకు దౌల్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సూపర్వైజర్లు జ్యోతి, మహాలక్ష్మి ఇద్దరు ఆస్పత్రికి తరలివచ్చారు. అనంతరం శిశువును సంగారెడ్డిలోని శిశువిహార్‌కు తరలించినట్లు ఎస్సై బాల్‌రెడ్డి తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మాతృత్వానికే మచ్చ ప్రస్తుత కరువు పరిస్థితుల్లో ఇంకెందుకులే ఈ ఆడశిశువు అనుకుందో ఏమోగాని పేగు బంధాన్ని సైతం మరచిపోయింది ఆ తల్లి. పొత్తిళ్లలో ఉండాల్సిన పసి పాపను రోడ్డుపక్కన చెట్టుకింద హృదయ విదారకంగా పరుపులో పడవేసింది. ఆడ శిశువును ఇలా రోడ్డుపక్కన వదిలేయడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోయారు. అయ్యో పాపం.. ఏ తల్లికన్న బిడ్డో అంటూ ఆస్పత్రి వద్ద కొంతమంది మహిళలు కంటతడి పెట్టా రు. పాపకు పాలు, నీళ్లు తాగిం చారు. అంతలోపే పాపను సంగారెడ్డి శిశువిహార్‌కు తరలిస్తుంటే అందరి కళ్లూ ఆ పాపపైనే ఉన్నాయి. ఏదిఏమైనా సభ్యసమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు మానవత్వానికి, మాతృత్వానికి మాయని మచ్చలా మిగిలిపోతున్నాయి. -
చిట్టి @ 5 కిలోలు
అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా మూడు నుంచి మూడున్నర కిలోల బరువు ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఔరా అని ఆశ్చర్యపోతాం. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏరియా ఆస్పత్రిలో ఓ మాతృమూర్తికి రెండో కాన్పుగా ఐదు కిలోల బరువు ఉన్న పాప పుట్టింది. కొత్తూరు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన యర్లంకి ప్రమీల ప్రసవ నొప్పులతో గురువారం ఉదయం ఆస్పత్రిలో చేరగా.. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే సాయంత్రం 4 గంటల సమయంలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయమై స్త్రీ వైద్య నిపుణురాలు ప్రసూన మాట్లాడుతూ తల్లి సరైన జాగ్రత్తలు తీసుకోవటం, మంచి పౌష్టికాహారం కారణంగా ఐదు కిలోల బరువుతో బిడ్డ జన్మించినట్టు చెప్పారు. - పాలకొండ రూరల్ -
ఆడపిల్ల పుట్టిందని.. చెత్తకుండీలో వేశారు
హైదరాబాద్: కన్న తల్లిదండ్రులే చిన్నారి పాలిట కర్కశకులుగా మారారు. ఏమాత్రం మానవత్వం లేకుండా అభంశుభం తెలియని ఆడ శిశువును వదిలేసి పోయారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించిన తల్లిదండ్రులు చిన్నారిని చెత్తకుండీలో వదిలి వెళ్లారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
పీఎం సందేశ స్ఫూర్తి
జుగ్గీల్లో కాలం వెళ్లదీసే బాలికలతోపాటు బడికి వెళ్లే ఆడపిల్లలకు టాయిలెట్ కష్టాలకు తెరపడనుంది. ఇటీవలి పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని ఇచ్చిన సందేశం మేరకు నగరంలో ఈ వసతి కల్పించే దిశగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ముందుకు సాగనుంది. సాక్షి, న్యూఢిల్లీ:అన్ని పాఠశాలలు, జుగ్గీలకు త్వరలో టాయిలెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అన్ని పాఠశాలలు, జుగ్గీలలో ఈ వసతి ఉండాలంటూ 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ సందేశ స్ఫూర్తితో దేశంలోని అన్ని ప్రాంతాల కంటే ముందే నగరంలో నిజం చేయడానికి రాష్ర్ట భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాఖ నడుం బిగించింది. అక్టోబర్ రెండో తేదీకంటే ముందే నగంరలోని272 ప్రభుత్వ పాఠశాలలు, 272 జుగ్గీలలో ఆడపిల్లల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఏటీఎంలతో తాగునీటిని అందించనుంది.ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను రూపొందించి సమర్పించాలంటూ మంగళవారం జరగనున్న సమావేశంలో కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆదేశించనుంది. చింది. కాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు తమ నిధుల నుంచి వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలకు రూ. 4 కోట్లు, కౌన్సిలర్లకు రూ. కోటి అభివృద్ధి నిధుల కింద అందుతాయి. నగరంలో బిజెపికి 29 ఎమ్మెల్యేలు, 165 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నగరంలోని కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో కనీసం ఒక పాఠశాలలో, ఒక జుగ్గీలలో బాలికల కోసం ప్రత్యేకంగా మరుగుగొడ్లను నిర్మించాలని, దీంతోపాటు ఓ వాటర్ ఏటీఎంను ఏర్పాటు చేయాలని ఆదేశించనుంది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటుచేసే పనిని ఎంపీలకు అప్పగించారు. ఢిల్లీలోని మొత్తం లోక్‌సభ స్థానాలు తమవే అయినందువల్ల కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పూనుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకగా టాయిలెట్లను ఏర్పాటు చేయొచ్చని బీజేపీ భావిస్తోంది. -
ఆడజన్మకు ఎన్ని శోకాలో...!
-
ఆడజన్మకు ఎన్ని శోకాలో...!
హైదరాబాద్: రెండవ సారి ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి అమ్మకానికి పెట్టాడు. ఐసిడిఎస్ అధికారులు అడ్డుకొని ఆ చిన్నారిని శిశువు విహార్‌కు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల శివారు గ్రామం బుగ్గతండాకు చెందిన సరోజ - సుధాకర్లకు మొదట ఒక ఆడపిల్ల పుట్టింది. మళ్లీ ఇటీవలే వారికి మరో ఆడపిల్ల పుట్టింది. సుధాకర్ బిడ్డను పెంచడం భారం అనుకున్నాడు. బిడ్డను పారవేద్దామని అనుకున్నాడు. ఈ విషయం తెలిసి పెద్దలు నచ్చజెప్పారు. బంగారు తల్లి పథకం వర్తిస్తుందని చెప్పారు. అయినా అతనిలో మార్పులేదు. ఆ బిడ్డను వదిలించుకోవాలని చూశాడు. హైదరాబాద్‌కు చెందిన ఒకరికి ఆ బిడ్డని పది వేల రూపాయలకు అమ్మడానికి ఆ తండ్రి సిద్ధపడ్డాడు. విషయం తెలిసిన స్థానిక అంగన్వాడీ టీచర్ సహకారంతో ఐసిడిఎస్ అధికారి సుగుణ అమ్మకాన్ని అడ్డుకున్నారు. ఆ బిడ్డని శిశువు విహార్‌కు తరలించారు. బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సుగుణ చెప్పారు. ఇటువంటి సంఘటనలను అడ్డుకోవడానికి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలు నిరోధించడానికి, ఆడపిల్లల అమ్మకాలను అడ్డుకోవడానికి వారి తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నట్లు ఆమె తెలిపారు.