జుగ్గీల్లో కాలం వెళ్లదీసే బాలికలతోపాటు బడికి వెళ్లే ఆడపిల్లలకు టాయిలెట్ కష్టాలకు తెరపడనుంది. ఇటీవలి పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని ఇచ్చిన సందేశం మేరకు నగరంలో ఈ వసతి కల్పించే దిశగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ముందుకు సాగనుంది.
సాక్షి, న్యూఢిల్లీ:అన్ని పాఠశాలలు, జుగ్గీలకు త్వరలో టాయిలెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అన్ని పాఠశాలలు, జుగ్గీలలో ఈ వసతి ఉండాలంటూ 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈ సందేశ స్ఫూర్తితో దేశంలోని అన్ని ప్రాంతాల కంటే ముందే నగరంలో నిజం చేయడానికి రాష్ర్ట భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాఖ నడుం బిగించింది. అక్టోబర్ రెండో తేదీకంటే ముందే నగంరలోని272 ప్రభుత్వ పాఠశాలలు, 272 జుగ్గీలలో ఆడపిల్లల కోసం ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ఏటీఎంలతో తాగునీటిని అందించనుంది.ఇందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను రూపొందించి సమర్పించాలంటూ మంగళవారం జరగనున్న సమావేశంలో కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ నాయకులు, కార్యకర్తలను ఆదేశించనుంది.
చింది. కాగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు తమ నిధుల నుంచి వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలకు రూ. 4 కోట్లు, కౌన్సిలర్లకు రూ. కోటి అభివృద్ధి నిధుల కింద అందుతాయి. నగరంలో బిజెపికి 29 ఎమ్మెల్యేలు, 165 మంది కౌన్సిలర్లు ఉన్నారు. నగరంలోని కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో కనీసం ఒక పాఠశాలలో, ఒక జుగ్గీలలో బాలికల కోసం ప్రత్యేకంగా మరుగుగొడ్లను నిర్మించాలని, దీంతోపాటు ఓ వాటర్ ఏటీఎంను ఏర్పాటు చేయాలని ఆదేశించనుంది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు లేని ప్రాంతాల్లో వాటిని ఏర్పాటుచేసే పనిని ఎంపీలకు అప్పగించారు. ఢిల్లీలోని మొత్తం లోక్‌సభ స్థానాలు తమవే అయినందువల్ల కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పూనుకుంటే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేకగా టాయిలెట్లను ఏర్పాటు చేయొచ్చని బీజేపీ భావిస్తోంది.
పీఎం సందేశ స్ఫూర్తి
Published Mon, Aug 18 2014 10:11 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement